Gas Cylinder Prices: సామాన్యులకు షాక్.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర.. ఎంతంటే.!

|

Feb 25, 2021 | 1:52 PM

Gas Cylinder Prices: ఒకవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంటే.. చమురు కంపెనీలు ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు పెంచేశాయి..

Gas Cylinder Prices: సామాన్యులకు షాక్.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర.. ఎంతంటే.!
Follow us on

Gas Cylinder Prices: ఒకవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంటే.. చమురు కంపెనీలు ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు పెంచేశాయి. వంటగ్యాస్‌పై రూ. 25 పెంచగా.. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 794కి చేరుకుంది.

ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది మూడోసారి. మొదటిసారి ఫిబ్రవరి 4వ తేదీన రూ. 25 పెంచిన చమురు కంపెనీలు.. ఆ తర్వాత 15న మరో రూ. 50 వద్దించాయి. ఇక ఇప్పుడు రూ. 25 వెరిసి మొత్తంగా ఈ నెలలో రూ. 100 బాదుడు వేశాయి. కాగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బాటుగా వంటగ్యాస్ ధరలు కూడా అదే బాటలో నడుస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో వంట గ్యాస్ ధరలు రెండుసార్లు పెరిగిన సంగతి విదితమే.

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?