G20 Summit in India: జి20 కోసం భారత్ చేసిన ఖర్చు రూ. 4,254 కోట్లు.. మరి రిటర్న్స్ ఏమోచ్చాయో తెలుసా?

G20 Summit in India: ఈసారి జీ20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దీని సన్నాహకాల కోసం భారతదేశం కోట్లాది రూపాయలను వెచ్చించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ సహా పలు పెద్ద దేశాల నేతలు జీ20 సమావేశానికి హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చారు. వీరితో పాటు ఆయా దేశాల ప్రముఖులు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. మరి ఇంతటి ప్రఖ్యాత సదస్సు నిర్వహించడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అనే సందేహం రాక మానదు.

G20 Summit in India: జి20 కోసం భారత్ చేసిన ఖర్చు రూ. 4,254 కోట్లు.. మరి రిటర్న్స్ ఏమోచ్చాయో తెలుసా?
G20 Summit In India

Updated on: Sep 10, 2023 | 7:12 AM

G20 Summit in India: ఈసారి జీ20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దీని సన్నాహకాల కోసం భారతదేశం కోట్లాది రూపాయలను వెచ్చించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ సహా పలు పెద్ద దేశాల నేతలు జీ20 సమావేశానికి హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చారు. వీరితో పాటు ఆయా దేశాల ప్రముఖులు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. మరి ఇంతటి ప్రఖ్యాత సదస్సు నిర్వహించడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అనే సందేహం రాక మానదు. ఈ సమావేశానికి భారత్ పెడుతున్న ఖర్చు ఎంత? ఈ సమావేశం ద్వారా భారత్‌కు కలిగే ప్రయోజనం ఏంటి? జి20 శిఖరాగ్ర సమావేశానికి ప్రతిఫలంగా భారత్‌కు దక్కే ప్రతిపలమేంటి? ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రూ. 4,254 కోట్లు ఖర్చు..

జీ20 సమావేశానికి ఢిల్లీని రెడీ చేసేందుకు రూ.4254.75 కోట్లు వెచ్చించారు. ఖర్చులను స్థూలంగా 12 వర్గాలుగా విభజించారు. G20 సన్నాహాల్లో అత్యంత ముఖ్యమైన అంశం భద్రత. దీంతో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, వీధి సూచికలు, లైటింగ్‌ల నిర్వహణకు కూడా ఖర్చు చేశారు. హార్టికల్చర్ మెరుగుదల నుండి జి20 బ్రాండింగ్ వరకు దాదాపు రూ.75 లక్షల నుండి రూ.3,500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖల నుండి NDMC, MCD వరకు తొమ్మిది ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఈ వ్యయం ఖర్చు చేయడం జరిగింది.

భారతదేశానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటి?

  1. భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జి20 సమ్మిట్ ద్వారా ఈ బంధం మరింత బలంగా మారనుంది. ఇది మాత్రమే కాదు, చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం ద్వారా భారతదేశం లాభపడే అవకాశం ఉంది.
  2. చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం కారణంగా, భారతదేశం – అమెరికన్ కంపెనీలకు పెద్ద ఆప్షన్‌గా ఎదుగుతోంది. చైనాలో అమెరికన్ ఐఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.
  3. చైనా బెదిరింపులపై అమెరికా క్లారిటీకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో.. భారతదేశం, అమెరికా మధ్య పెరుగుతున్న సంబంధాలు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అమెరికా కంపెనీలు భారత్ వైపు మళ్లవచ్చు. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకోగలదు.
  4. అలాగే, రెన్యూవబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌పై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం రెండు దేశాలు కలిసి 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇది పునరుత్పాదక శక్తి, బ్యాటరీ నిల్వ, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి అవకాశాన్ని అందిస్తుంది.
  5. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ధాన్యం ఒప్పందం, కరోనా వ్యాక్సిన్ పరిశోధన, MSCA ఫైటర్ జెట్ ఇంజిన్‌కు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి.
  6. బ్రిటన్, జర్మనీ జీ20 దేశాల మధ్య సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ యూపీఐ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
  7. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. హెలికాప్టర్లు, రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
  8. ప్రపంచంలోని 19 శక్తివంతమైన దేశాల నాయకులు భారతదేశంలో సమావేశమయ్యారు. ఈ దేశాలు భారతదేశానికి రావడం వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.
  9. భారతదేశానికి స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం లభిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం భారతదేశంలో వ్యాపారాన్ని పెంచుతుంది. వాణిజ్య పరంగా ఈ సమావేశం భారత్‌కు ఎంతగానో సహాయపడుతుంది.
  10. ప్రధానంగా ఈ సమావేశం ద్వారా పొరుగు దేశం చైనాను ఇరుకున పెట్టేందుకు భారత్ అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. లక్షలాది ప్రయత్నాలు ఉన్నప్పటికీ, చైనా తన విస్తరణ విధానంతో నిరంతరం ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీ20 సభ్య దేశాల ద్వారా చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తుంది.

మరినని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..