G20 Sherpa Meet: భారత్‌లో G20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందుగా.. దేశంలోని 50 ప్రధాన నగరాల్లో జీ20 సమ్మిట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పాటికే ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాల్లో జీ20 సన్నాహక సమావేశాలు ముగిసాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే మార్చి 31న కేరళలోని కుమరకోమ్‌లో రెండవ రౌండ్ షెప్రా సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ సమావేశాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తన ప్రసంగంతో ప్రారంభించారు. షెర్పా మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకముందు షెర్పా సమావేశానికి వచ్చిన ప్రతినిధులను ఆయన సాదరంగా స్వాగతించారు. ఇంకా ఈ సందర్భంగా జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారతదేశానికి మద్ధుతు తెలిపిన ఆయా దేశాల ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Ellavarkkum Swagatham ?
ఇవి కూడా చదవండిAll smiles as the #G20India delegates receive a warm welcome on Day 2⃣ of #SherpaMeeting in #Kumarakom. ?
An action-packed day awaits, keep watching this space for all the details. pic.twitter.com/vDSKQ6OIwc
— G20 India (@g20org) March 31, 2023
G20 షెర్పా మీటింగ్‌లో భారత జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తన ప్రసంగాన్ని అందించారు. ఈ సమయంలో ఆయన ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలతో పాటు ఇతర G20 దేశాల ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు. అయితే ఆయన రెండో సెషన్‌లో ఈ చర్చలు జరిపారు. ఇక అంతకముందు జరిగిన మొదటి సెషన్‌లో డిజిటల్ ఎకానమీ, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, కల్చర్ వర్కింగ్ గ్రూపులకు సంబంధించిన సాంకేతిక పరివర్తనపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
2nd #SherpaMeeting sessions have commenced with the opening remarks & overview given by #G20India Sherpa @amitabhk87.
Session 1 – Technological Transformation will include discussions and progress made under:
Digital Economy, Health, Education, Tourism & Culture Working Groups. pic.twitter.com/ZUhoEL9uqK— G20 India (@g20org) March 31, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..