G20 Meeting: ఒడిశాలో రెండవ జీ20 సాంస్కృతిక సమావేశం.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు

|

May 14, 2023 | 8:12 PM

రెండవ జీ20 కల్చర్ వర్కింగ్‌ గ్రూప్ (సీడబ్ల్యూజీ) సమావేశం ఆదివారం నుంచి ఒడిశాలోని భూవనేశ్వర్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు మే 17 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి జీ20కి చెందిన సభ్యులు, అతిథి దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు హాజరుకానున్నాయి. ఇందులో భాగంగా అతిథి దేశాలు..

G20 Meeting: ఒడిశాలో రెండవ జీ20 సాంస్కృతిక సమావేశం.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు
G20 Summit
Follow us on

రెండవ జీ20 కల్చర్ వర్కింగ్‌ గ్రూప్ (సీడబ్ల్యూజీ) సమావేశం ఆదివారం నుంచి ఒడిశాలోని భూవనేశ్వర్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు మే 17 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి జీ20కి చెందిన సభ్యులు, అతిథి దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు హాజరుకానున్నాయి. ఇందులో భాగంగా అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సాంస్కృతిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా చర్చించడానికి, సమస్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి ఒక అవకాశాన్ని ఈ సమావేశం అందిస్తుంది. సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, డోనర్ శాఖ మంత్రి జికె రెడ్డి, సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు.

కల్చర్ ట్రాక్ ఆఫ్ ఇండియాస్‌ జీ20 ప్రెసిడెన్సీ కింద గుర్తించిన 4 కీలక ప్రాధాన్యత రంగాలపై కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు దృష్టి పెట్టాయి. అవి సాంస్కృతిక ఆస్తి రక్షణ అండ్‌ పునరుద్ధరణ, స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం, సాంస్కృతిక అండ్‌ సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, సంస్కృతి రక్షణ అండ్‌ ప్రోత్సాహం కోసం డిజిటల్ సాంకేతికతను పెంపొందించడం వంటివి ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగిన 1వ సీడబ్ల్యూజీ సమావేశానికి కొనసాగింపుగా 2వ సీడబ్ల్యూజీ సమావేశం జరుగుతుంది. 1వ సమావేశం తర్వాత, గత రెండు నెలలుగా నిపుణుల ద్వారా అంతర్జాతీయ వెబ్‌నార్‌లు జరిగాయి. G20 సమావేశం థీమ్ ‘సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది. విభిన్న సంస్కృతులు, వర్గాల మధ్య శాంతియుత సహజీవనం ఆధారంగా బహుపాక్షికతపై భారతదేశం అచంచలమైన నమ్మకాన్ని హైలైట్ చేయడానికి ఇది ఒక ప్రచారం. సాంస్కృతిక మార్పిడి, అవగాహనను స్వీకరించడం ద్వారా మేము సరిహద్దులను అధిగమించగలము, అనుబంధాలను పెంపొందించగలము, అలాగే వ్యక్తులు, సంఘాలు, దేశాల మధ్య అర్థవంతమైన సంభాషణను ప్రేరేపించగలమని ఈ థీమ్ గుర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీ20 కల్చర్ వర్కింగ్‌ గ్రూప్‌ సభ్యుల కోసం వివిధ సాంస్కృతిక అనుభవాలను సిద్ధంగా ఉంచారు. ప్రతినిధులు ఒడిశాలో ఉన్నప్పుడు కోణార్క్ సూర్య దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, ఉదయగిరి గుహలను సందర్శిస్తారు. వారు ఒడిశాకు చెందిన గిరిజన (సింగారి), సంబల్‌పురి, ఒడిస్సీ, గోటిపువా వంటి ప్రత్యేక నృత్య ప్రదర్శనలు కూడా ఈ సమావేశంలో భాగంగా ఉంటాయి. 2వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా, భువనేశ్వర్‌లోని ఒడిశా క్రాఫ్ట్స్ మ్యూజియం కళాభూమిలో ‘సస్టైన్‌ ది క్రాఫ్ట్ ఇడియమ్’ పేరుతో ప్రదర్శన ఉంటుంది. కల్చర్ వర్కింగ్ గ్రూప్ రెండో ప్రాధాన్యత అంశమైన ‘సుస్థిర భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం’ ఆధారంగా ఈ ప్రదర్శన ఉంటుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ ప్రదర్శనను మే 15న ప్రారంభించనున్నారు. మే 16 నుంచి 22 వరకు ప్రజల కోసం దీనిని అందుబాటులో ఉంచుతారు. జీ20 దేశాల సభ్యులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో లోతైన చర్చల ద్వారా కల్చర్ వర్కింగ్ గ్రూప్‌ పని చేస్తుంది. పరస్పర సహకారం కోసం కీలక అంశాలను గుర్తించడం, స్థిరమైన అభివృద్ధి కోసం స్పష్టమైన సిఫార్సులు, ఉత్తమ పద్ధతులను మరింత మెరుగుపరచడం వంటివాటిని కల్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి