Liquor Sales: మందుబాబులకు షాక్.. ఇకపై ఆ రెండు ఉంటేనే లిక్కర్ సేల్.. !

|

Sep 03, 2021 | 12:31 PM

తమిళనాడులో అర్హులైన ప్రతి వ్యక్తికి కోవిడ్ టీకాలు వేసే ప్రయత్నాలలో భాగంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే మద్యం విక్రయించాలని నిర్ణయించారు.

Liquor Sales: మందుబాబులకు షాక్.. ఇకపై ఆ రెండు ఉంటేనే లిక్కర్ సేల్.. !
Alcohol
Follow us on

Full Vaccination must for Buying Liquor: తమిళనాడులో అర్హులైన ప్రతి వ్యక్తికి కోవిడ్ టీకాలు వేసే ప్రయత్నాలలో భాగంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే మద్యం విక్రయించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా ఇప్పటికే 70శాతం మందికి టీకాలు వేశారు.

నీలగిరి జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న TASMAC అవుట్‌లెట్‌ల నుండి మద్యం కొనుగోలు చేయాలనుకునే వారికి కరోనావైరస్ నుండి పూర్తిగా టీకాలు వేయించడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్నట్లు చూపించే కస్టమర్లు తమ టీకా సర్టిఫికెట్‌లను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

దీని వల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు తీసుకుంటారని భావిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్య చెప్పారు. కాగా, ఇప్పటికే జిల్లా జనాభాలో దాదాపు 97% మందికి వ్యాక్సిన్ డోస్ ఇవ్వడం జరిగిందన ఆమె తెలిపారు. పౌరులందరూ రెండవ మోతాదు టీకా తీసుకోవాలని, తద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చినట్లు ఆమె చెప్పారు. అయితే, మద్యం పొందాలనుకునేవారు టీకా సర్టిఫికేట్‌లతో పాటు, TASMAC అవుట్‌లెట్‌లకు వినియోగదారులు తమ ఆధార్ కార్డులను కూడా సమర్పించాల్సి ఉంటుందని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

Read Also….  Viral Video: యువకుడి వినూత్న ఆలోచన.. వధువు కావలెను అంటూ టీ స్టాల్ ముందు సైన్‌ బోర్డ్‌.. వీడియో

Garlic-Ayurveda: వెల్లుల్లితో ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చెక్ .. దీనిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా..

Garlic-Ayurveda: వెల్లుల్లితో ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చెక్ .. దీనిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా..