Fuel Prices: శీతాకాలం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

|

Feb 26, 2021 | 7:59 PM

Fuel Prices: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగడంతో సామాన్యులకు మరింత భారంగా మారిపోయింది. అయితే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో...

Fuel Prices: శీతాకాలం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Follow us on

Fuel Prices: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగడంతో సామాన్యులకు మరింత భారంగా మారిపోయింది. అయితే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదువుతోంది. ధరల పెరుగుదలతో వాహనాలు బయటకు తీయలేని పరిస్థితి ఎదురవుతోంది. పెరిగిన ధరలతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక దేశ వ్యాప్తంగా అనే ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ.100 చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇదిలా ఉంటే పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా వ్యవహరించడంపై అటు వాహనదారులు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ తీరుపై వారంతా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగులున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. శీతాకాలం తర్వాత పెట్రోల్‌ ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. శీతాకాలం అనంతరం పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు ధరలు కూడా అధికంగా ఉంటాయన్నారు. శీతాకాంలలో పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ అధికంగా ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల అనేది ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికపరమైన ఒత్తిడిలు చాలా ఉంటాయని, కరోనా సమయంలో రాష్ట్రానికి, దేశానికి డబ్బులు చాలా అవసరమని, ధరలు పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం మీద పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ధరల తగ్గుదలపై పోరాటం..

కాగా, దేశ వ్యాప్తంగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు, ప్రతిపక్షాలు, ఇతర నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆందోళనకు దిగుతున్నాయి. రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేలా చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువులు పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామాన్యులు.. వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందుల్లో పడిపోతున్నారు.

Also Read: No Baggage Charges: ఎలాంటి లగేజీ లేకుండా విమాన ప్రయాణం చేసే వారికి గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరల్లో రాయితీలు