Fuel prices: పెట్రోల్ ధరలు ఏప్రిల్‌లోపు తగ్గుతాయి.. కీలక కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

|

Feb 28, 2021 | 5:43 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగడంతో సామాన్యులకు మరింత భారంగా మారిపోయింది. అయితే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదువుతోంది...

Fuel prices: పెట్రోల్ ధరలు ఏప్రిల్‌లోపు తగ్గుతాయి.. కీలక కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Follow us on

Fuel prices: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్యులకు మరింత భారంగా మారిపోయింది. ఈ క్రమంలో వాహనదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదువుతోంది. ధరల పెరుగుదలతో వాహనాలు బయటకు తీయలేని పరిస్థితి ఎదురవుతోంది. పెరిగిన ధరలతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక దేశ వ్యాప్తంగా అనే ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ.100 చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. 

తాజాగా పెట్రోల్ ధరల భారీగా పెరగడంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.  పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల్లోని తమ సహచరులను చమురు ఉత్పత్తిని పెంచమని కోరామని, తద్వారా భారతీయ వినియోగదారులకు త్వరలోనే ఇంధన ధరలు భారం ఉపశమనం లభిస్తుందని తెలిపారు.

“కోవిడ్ -19 మహమ్మారి కారణంగా డిమాండ్ గణనీయంగా తగ్గినందున గత ఏడాది ఏప్రిల్‌లో, చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ దేశాలు ఎక్కువ లాభం పొందడానికి తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. కానీ కోవిడ్ వ్యాప్తి తగ్గిపోవడంతో వినియోగం పూర్వం మాదిరిగా పెరిగింది. అందువల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి ”అని ప్రధాన్ శనివారం సాయంత్రం వారణాసిలో ఒక విలేకరులతో చెప్పారు.

అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా, ఉత్పత్తిని పెంచమని భారతదేశం చమురు ఉత్పత్తి చేసే దేశాలైన రష్యా, ఖతార్, కువైట్ వంటి దేశాలపై ఒత్తిడి తెస్తోందని ఆయన అన్నారు. ఉత్పత్తి పెరిగినప్పుడు, బ్యారెల్ కొనుగోలు ఖర్చు తగ్గుతుందని…ఆ తరువాత రిటైల్ ఇంధన ధర కూడా తగ్గుతుందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని అని అడగ్గా.. ఆ విషయం ఎవరూ ఊహించలేరని.. కానీ మార్చి లేదా ఏప్రిల్ నాటికి తగ్గే అవకావశాలు ఉన్నట్లు చెప్పారు.శీతాకాలం ముగిశాక ఇంధన ధరలు పడిపోయే అవకాశం ఉందని శుక్రవారం కూడా ప్రధాన్ చెప్పారు. ఈ సీజన్లో డిమాండ్ పెరగడంతోనే రేట్లు పెరుగుతున్నాయని వెల్లడించారు. 

Also Read:

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు