ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ప్రధాని మోదీ, జమ్మూ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ ప్రశంస

తమ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు అదేపనిగా ప్రధాని మోదీని విమర్శిస్తుంటే..మరో వైపు ఇదే పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆయనను (మోదీని) ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు..

  • Umakanth Rao
  • Publish Date - 4:47 pm, Sun, 28 February 21
ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ప్రధాని మోదీ, జమ్మూ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ ప్రశంస

తమ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు అదేపనిగా ప్రధాని మోదీని విమర్శిస్తుంటే..మరో వైపు ఇదే పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆయనను (మోదీని) ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని, తనను చాయ్ వాలా గా చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకంజ వేయరని, గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. ప్రధాన మంత్రి అయినా తన తొలి ప్రస్థానాన్ని అయన మరువలేదన్నారు.  ఆదివారం జమ్మూలో గుజ్జర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నుంచి ప్రజలు ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు.తనకు ఆయనతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ , ఆయన ఒదిగి ఉండే వ్యక్తి అన్నారు. ఈ నెల 15 తో ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపథ్యంలో అంతకుముందు రోజున పార్లమెంటులో ప్రసంగించిన మోదీ.. తనకు. ఆజాద్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంట తడి పెట్టారు. తాను గుజరాత్ సీఎంగా, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉండగా తమ మధ్య ఉన్న స్నేహం ఈ నాటికీ చెక్కుచెదరలేదని ఆయన అన్నారు. తమ పార్టీలు వేరైనా తమ మైత్రి మాత్రం ఇంకా కొనసాగుతోందని, ఆజాద్ ఉత్తమ పార్లమెంటేరియన్ అని, ఆయనను రిటైర్ కానివ్వనని కూడా మోదీ ఆ సందర్భంలో పేర్కొన్నారు.

2007 లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగినప్పుడు ఆ ఘటన గురించి మొదట తనకు తెలియజేసింది ఆజాదే అన్నారాయన. ఇలా ఉండగా..జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ధికి   కేంద్రం నుంచి మరిన్ని నిధులు అవసరమని గులాం నబీ ఆజాద్ అన్నారు. అటు- కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని నిన్న పార్టీ సీనియర్ నేతలు కోరారు. త్వరలో  5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీని పటిష్ట పరచాలని ఆజాద్ సహా అంతా సూచించారు. ఒకప్పుడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి  బాహాటంగా లేఖ రాసి ‘జీ-23’ గ్రూప్ అసంతృప్త నేతలుగా ఈ వర్గం ముద్ర వేసుకుంది.

Read More:

How To Find A Lost Phone: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఎలా దానిని ట్రేస్ చేయాలో తెలుసుకుందాం..!

Army recruitment exam paper leak: ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు.. పూర్తి వివరాలు