పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు మారుతాయని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయ పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అయితే మే 2 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసేలా పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. ఈ కొత్త పనివేళలు జులై 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేసవిలో కరెంట్ వాడకం ఎక్కువగా పెరగడం వల్లే ఈ పనివేళలు మార్చామన్నారు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కరెంట్ వాడకం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోందని..ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తే కరెంట్ లోడ్ గరిష్ఠ స్థాయిని 350 మెగావాట్ల నుంచి 300 వరకు తగ్గించవచ్చని స్పష్టం చేశారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే తన కార్యాలయానికి చేరుకుంటానని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం