Freedom fighter Shakuntala Choudhary: గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి (102) సోమవారం కన్నుమూశారు. అస్సాం(Assam)లోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసం పనిచేశారు. దేశవ్యాప్తంగా ఆమె ‘శకుంతల బైడియో’గా ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమెను భారత ప్రభుత్వం(India Government)పద్మశ్రీ(Padmashree) అవార్డుతో ఘనంగా సత్కరించింది.
శకుంతలా చౌదరి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. గాంధేయ విలువలను పెంపొందించేందుకు శకుంతలా చౌదరి జీవితాంతం చేసిన కృషికి గుర్తుండిపోతారని ఆయన అన్నారు. “సరనియా ఆశ్రమంలో ఆమె చేసిన గొప్ప పని చాలా మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. ఆమె మరణించడం బాధాకరం. నా ఆలోచనలు ఆమె కుటుంబం మరియు అసంఖ్యాక ఆరాధకులతో ఉన్నాయి,” అన్నారాయన.సరనియా ఆశ్రమం అస్సాంలోని గౌహతిలో ఉంది.
Shakuntala Choudhary Ji will be remembered for her lifelong efforts to promote Gandhian values. Her noble work at the Sarania Ashram positively impacted many lives. Saddened by her passing away. My thoughts are with her family and countless admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 21, 2022
కాగా, ఆమె వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గౌహతిలోని కస్తూర్బా ఆశ్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. అస్సాంకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త శకుంతలా చౌదరి గౌహతిలోని కస్తూర్బా ఆశ్రమంలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ఆమె పనిచేశారు. ఆమె భారత ప్రభుత్వం నుండి వయోశేష్ఠ సమ్మాన్ – సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ అవార్డులు 2021 సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.
ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. “పెద్ద గాంధేయవాది పద్మశ్రీ శకుంతలా చౌదరి మరణించినందుకు తీవ్ర వేదన” అని రాశారు. “1946లో మహాత్మా గాంధీ బస చేసిన గౌహతిలోని సరానియా ఆశ్రమంలో ఆమె జీవితం నిస్వార్థ సేవ, సత్యం, సరళత మరియు అహింసకు అంకితం చేయబడింది. ఆమె సద్గతి ఓం శాంతికి నా ప్రార్థనలు!,” అన్నారాయన.
Read Also… AP Minister Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి కారణం అదేనా..?