Ambulance Couple: ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్న దంపతులు.. ఆర్థిక కష్టాల్లోనూ ఆగని సేవలు

|

Jul 03, 2021 | 2:18 PM

Ambulance Couple: ఎవరైనా ప్రమాదం అంచుల్లో ఉన్న సమయంలో వెంటనే వైద్య సహాయం అందితే.. వారి జీవిత కాలం పొడిగించ వచ్చు. యాక్సిడెంట్స్ అయినా , హార్ట్ ఎటాక్ వంటి అనుకోని వ్యాధులైనా బాధితులను వెంటనే ..

Ambulance Couple: ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్న దంపతులు.. ఆర్థిక కష్టాల్లోనూ ఆగని సేవలు
Ambulance Couple
Follow us on

Ambulance Couple: ఎవరైనా ప్రమాదం అంచుల్లో ఉన్న సమయంలో వెంటనే వైద్య సహాయం అందితే.. వారి జీవిత కాలం పొడిగించ వచ్చు. యాక్సిడెంట్స్ అయినా , హార్ట్ ఎటాక్ వంటి అనుకోని వ్యాధులైనా బాధితులను వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాలి . ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన బాధితులను 30 నుంచి 60 నిమిషాల లోపు హాస్పటల్ కు తాలించాలి. దీనిని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులను తీసుకుని వెళ్తే.. వైద్యులు తగిన చికిత్సనందించి బతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే రోజు రోజుకీ పెరుగుతన్న ప్రమాదాలతో అంబులెన్స్ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉండడం లేదని ఈ దంపతులు గమనించారు. గత 20 ఏళ్లుగా బాధితులకు ఉచితంగా ఆంబులెన్స్ సేవలను అందిస్తుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఢిల్లీకి చెందిన హిమాంషు, ట్వింకిల్ కాలియాలు దంపతులు.

ఢిల్లీకి చెందిన హిమాంషు , ట్వింకిల్ కాలియా లకు 2002లో వివాహం జరిగింది. 1992 లో హిమాంషు తండ్రికి ప్రమాదం జరిగింది. అప్పుడు హిమాంషు వయసు 14 ఏళ్ళు. అప్పుడు అంబులెన్స్ కోసం యత్నించారు. అయితే అంబులెన్స్ వెంటనే దొరకలేదు.. యాక్సిడెంట్ జరిగిన 7 గంటల తర్వాత అంబులెన్స్ దొరికింది. అప్పుడు హిమాంషు తండ్రిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో హిమాంషు తండ్రి కోమాలోకి వెళ్లిపోయాడు. తరువాత 2 ఏళ్లకు అతను కోలుకున్నాడు.

ఈ సంఘటన హిమాంషు పై ప్రభావం చూపించింది. తమకు జరిగినట్లు వేరెవరికీ జరగకూడదని అతను కోరుకున్నాడు. దీంతో హిమాంషు పెళ్ళికి గిఫ్ట్ గా అతని తల్లిదండ్రులు ఆంబులెన్స్‌ను ఇచ్చారు. అప్పటి నుంచి హిమాంషు దంపతులు ఉచితంగా ఆంబులెన్స్ సేవలను అందిస్తున్నారు.

ప్రస్తుతం వారి వద్ద ప్రస్తుతం 14 ఆంబులెన్స్‌లు ఉన్నాయి. 10 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. అంబులెన్స్ కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ లు కూడా ఉన్నాయి. బాధితులు ఫోన్ చేసిన వెంటనే ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తారు ఈ దంపతులు. అయితే ఇప్పటి వరకూ ఈ సేవలను నిర్వహణ ఖర్చులను తమ జీతాల నుంచి తీసి ఇస్తున్నారు. వీరు చేస్తున్న సేవలను గుర్తించి ఎన్నో అవర్దులు వరించాయి.. కానీ ఆ సేవలకు అండగా నిలబడి ఆర్ధిక సాయం అందించేవారికోసం ఈ దంపతులు ఎదురుచూస్తున్నారు.

Also Read: Art Director Leeladhar: దాదా సాహెబ్ అవార్డు విన్నర్.. నేడు రోజు గడవనిస్థితిలో సహాయంకోసం ఎదురు చూపులు