దేశంలో ఫోర్త్ వేవ్(Fourth Wave in India) ముప్పు ముంచుకొస్తోంది. దాదాపు109 రోజుల తర్వాత జూన్ 15న కరోనా కేసులు మళ్లీ 10వేల మార్క్ ను తాకాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,213 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్ కారణంగా మరో 11 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి 7,624 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టీవ్ కేసులు ఉన్నారు. గతవారంతో పోలిస్తే అధికంగా 38.4 శాతం కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 2.35శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,19,419కరోనా నిర్ధరణ పరీక్షలు(Corona Cases) నిర్వహించారు. ఇప్పటివరకు జరిపిన టెస్ట్ ల సంఖ్య 85.63 కోట్లు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.65శాతం నమోదైంది. దేశ వ్యాప్తంగా జూన్ 16 నాటికి 195.67 కోట్లు వ్యాక్సిన్ డోసులు అందించారు. దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. మహారాష్ట్రలో(Maharashtra) 19,261 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్యలో 36శాతం పెరుగుదల నమోదైంది. కరోనా వైరస్ బీఏ 5 వేరియంట్ కేసులు 4 వెలుగు చూశాయి. ముంబయి, థానే, నవీ ముంబయి, పుణె ప్రాంతాల్లో బీఏ 5 వేరియంట్ కేసులను గుర్తించారు.
కేరళలో 17,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 3,488 మందికి కొత్తగా కరోనా సోకింది. కర్నాటకలో 3,997 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 648 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఢిల్లీలో 3,643 యాక్టీవ్ కేసులు ఉండగా గత 24 గంటల్లో 1,375 కేసులు కొత్తగా నమోదయ్యాయి. తమిళనాడులో 1,938 యాక్టీవ్ కేసులు ఉండగా గత 24 గంటల్లో 476 మంది వైరస్ బారిన పడ్డారు. హర్యానాలో 2,114 కేసులు ఉండగా..తాజాగా 596 మందికి కరోనా సోకింది. తెలంగాణలో కొత్తగా 205 మందికి కరోనా సోకగా క్రియాశీల కేసులు 1,401 ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలందరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. కొవిడ్ సోకిన వ్యక్తుల నుంచి సాంపిళ్లను సేకరించి తమకు పంపాలని ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడులను కోరారు. తొలి వేవ్ లో 60 ఏళ్లకు పైబడ్డవారు ప్రభావితం కాగా, రెండో వేవ్ లో 45-60, 60 ఏళ్లు మించిన ప్రజలు ప్రభావితమయ్యారు. అయితే వ్యాక్సిన్ లు తీసుకున్న వారు.. ఒకసారి కరోనా వచ్చి తగ్గాక వారిలో యాంటీ బాడీస్ పెరుగుతాయి. ఒమిక్రాన్ వేరియంట్ కు 50కి పైగా జన్యు ఉత్పరివర్తనాలు సంభవించాయి.
సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ తక్కువ ప్రభావం చూపింది. కేసులు, మరణాలు కూడా తక్కువగా నమోదయ్యాయి. 2022 జూన్ 22 నుంచి ఫోర్త్ వేవ్ ప్రారంభమవుతుంందని ఐఐటీ పరిశోధక బృందం అంచనా వేశారు. 2022 ఆగస్ట్ 23 నాటికి తారాస్థాయికి చేరుకుంటుందని, 2022 అక్టోబర్ 24 నాటికి ఫోర్త్ వేవ్ తగ్గిపోతుందని వెల్లడించారు. కేసుల నమోదులో ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు కొవిడ్ కారణంగా 5,24,803 మంది మరణించారు. దేశంలోని పెద్దలకు 80శాతం వాక్సినేషన్ పూర్తయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి