Supreme Court: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు జడ్జీలకు పాజిటివ్.. న్యాయస్థానం కీలక నిర్ణయం

|

Apr 22, 2021 | 11:01 AM

COVID-19 positive: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. అందరూ

Supreme Court: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు జడ్జీలకు పాజిటివ్.. న్యాయస్థానం కీలక నిర్ణయం
Supreme Court
Follow us on

COVID-19 positive: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో విధులు నిర్వ‌ర్తిస్తున్న న‌లుగురు న్యాయమూర్తులు కోవిడ్ బారిన‌ప‌డ్డారు. వారిలో ఓ జ‌డ్జి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న‌ట్లు పేర్కొంటున్నారు. అయితే.. క‌రోనా పాజిటివ్‌గా తేలిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సోమ‌వారం వ‌ర‌కు విచార‌ణ‌లు చేప‌ట్టిన‌ట్లు సమాచారం. అయితే ఓ న్యాయమూర్తి పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆ జడ్జీ కోలుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జ‌స్టిస్ ఎంఆర్ షా అధికారిక నివాసంలో ప‌నిచేసే సిబ్బంది అంద‌రికీ క‌రోనావైర‌స్ నిర్ధారణ అయింది. జస్టీస్ ఇందిరా బెనర్జీ కూడా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంలో ప‌నిచేస్తున్న 40 మంది సిబ్బందికి క‌రోనా సోకినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. కోర్టుకు రాలేని ప‌క్షంలో ఇంటి నుంచి ప‌నిచేయాలంటూ ఏప్రిల్ 13వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కరోనా కలకలం సృష్టిస్తుండటంతో.. ఈ రోజు నుంచి (ఏప్రిల్ 22) అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్లు ధర్మాసనం సర్క్యూలర్‌ను విడుదల చేసింది.

 

Also Read: