కరోనా వైరస్ పాజిటివ్‌కి గురైన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బుధవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. అహ్మద్ నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన దిలీప్ గాంధీ.. లోగడ షిప్పింగ్ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. కాగా ఆయన మరణానికి కరోనా వైరసే కారణమా అన్నది నిర్ధారణ కాలేదని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. బహుశా ఇతర రుగ్మతల కారణంగా కూడా ఆయన మరణించి ఉండవచ్చునని ఇవి పేర్కొన్నాయి. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దిలీప్ గాంధీ 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. దిలీప్ గాంధీ మృతికి మాజీ మంత్రి సురేష్ ప్రభు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.
సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video