పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల , మాజీ సీఎం వీ. నారాయణస్వామికి మొండిచెయ్యి
పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ పేర్లలో మాజీ సీఎం వీ. నారాయణ స్వామి పేరు లేదు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటారని...
పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ పేర్లలో మాజీ సీఎం వీ. నారాయణ స్వామి పేరు లేదు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటారని, ఎలెక్షన్ మేనేజ్ మెంట్ లో కీలక పాత్ర వహిస్తారని పార్టీ నేత దినేష్ గుండూరావు తెలిపారు. నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని చెప్పిన ఆయన.. 14 మంది అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేశామన్నారు. పుదుచ్చేరి లోని 30 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ఏప్రిల్ 6 న జరగనుంది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభిస్తుందని ఆశించిన నారాయణస్వామి తనకు అవకాశం దక్కక పోవడంతో ఆశాభంగం చెందారు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తనకు, తన సహచరుల్లో కొంతమందికి టికెట్లు లభించకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా-30 స్థానాల్లో ఐదింటిని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. నారాయణస్వామి నేతృత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్ల పాలనను పూర్తి చేసుకోలేకపోయింది. ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఆయన ప్రభుత్వం గత ఫిబ్రవరి చివరి వారంలో మైనారిటీలో పడిపోయింది. 22 న ఆయన అసెంబ్లీలో బల పరీక్షను నిరూపించుకోలేక పోయారు. చివరకు రాజీనామా చేశారు. 23 న ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు.
అనంతరం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను, ఎన్ ఆర్ కాంగ్రెస్ 8 స్థానాలను, అన్నాడీఎంకే నాలుగింటిని, డీఎంకే రెండు సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కాగా ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి తాను కృషి చేస్తానని నారాయణస్వామి చెప్పారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని చదవండి ఇక్కడ : TV9 Telugu 4 Minutes 24 Headlines Video: కౌంటింగ్ కౌన్‌డౌన్.. మొదలైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.