Chaudhary Ajit Singh: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా ఎవ్వరిని వదిలి పెట్టకుండా బలి తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. కోవిడ్ బారిన పడిన ఆయన గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాగా, చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంతరం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. యూపీలోని బాగ్‌పత్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగానూ పనిచేశారు. అజింత్ సింగ్ తండ్రి చరణ్ సింగ్..1979-80లో ఆరు నెలల పాటు భారత ప్రధానిగా సేవంలందించారు. అజింత్ ఉన్నత చదువులు చదువుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్, చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను అభ్యసించారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా చేరినప్పటికీ 1996 లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం.. అజిత్ సింగ్ ఆర్‌ఎల్‌డిని ఏర్పాటు చేసి 2001 లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.
ఇవీ చదవండి: