AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీం మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ‌న్ మృతి

సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏఆర్ ల‌క్ష్మ‌ణ‌న్(78) క‌న్నుమూశారు. స‌తీమ‌ణి మ‌ర‌ణంతో మాన‌సిక కుంగుబాటుకు గురై ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆయ‌న గురువారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ప్ర‌స్తుతం వీరు కారైకుడిలో.

సుప్రీం మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ‌న్ మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 28, 2020 | 11:36 AM

Share

సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏఆర్ ల‌క్ష్మ‌ణ‌న్(78) క‌న్నుమూశారు. స‌తీమ‌ణి మ‌ర‌ణంతో మాన‌సిక కుంగుబాటుకు గురై ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆయ‌న గురువారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ప్ర‌స్తుతం వీరు కారైకుడిలో నివ‌సిస్తున్నారు. మంగ‌ళ‌వారం ల‌క్ష్మ‌ణ‌న్ భార్య మీనాక్షి ఆచ్చి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. దీంతో ఆయ‌న మాన‌సిక కుంగుబాటుకు గురై అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

కాగా జ‌స్టిస్ ఏఆర్ ల‌క్ష్మ‌ణ‌న్ 1942 మార్చి 22న త‌మిళ‌నాడులో శివ‌గంగై జిల్లా దేవ‌కొట్టైలో జ‌న్మించారు. మ‌ద్రాసు హైకోర్టు, కేర‌ళ హైకోర్టుల‌లో న్యాయ‌మూర్తిగా సేవ‌లందించారు. 2000లో రాజ‌స్థాన్‌, 2001లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుల‌లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా పని చేశారు. ఇక 2002లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. 2007లో రిటైర్ అవ్వ‌గా.. ఆ త‌ర్వాత రెండేళ్లపాటు లా క‌మిష‌న్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ప‌లు కేసుల్లో సంచ‌ల‌న‌మైన తీర్పుల‌ను వెల్ల‌డించిన ఘ‌న‌త ల‌క్ష్మ‌ణ‌న్‌కు ఉంది.

Read More:

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌