SSC జేఈ, ఢిల్లీ పోలీస్, CAPF SI 2026 పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 ఏడాదికి నిర్వహించనున్న జూనియర్ ఇంజినీర్ (JE), ఢిల్లీ పోలీస్, CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయి? కొత్త తేదీలు, పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోండి..

హైదరాబాద్, అక్టోబర్ 27: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 ఏడాదికి సంబంధించి నిర్వహించనున్న జూనియర్ ఇంజినీర్ (JE), ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తాజా షెడ్యూల్‌ను పరిశీలించాలని సూచించింది. పరీక్షల తేదీల్లో మార్పుల నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
SSC JE, SI పరీక్షల కొత్త తేదీలు ఇవే..
తాజా షెడ్యూల్ ప్రకారం జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు, అలాగే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1, 2026 వరకు జరగనున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీస్, CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పరీక్షలను నవంబర్ 23 నుంచి 28, 2026 వరకు నిర్వహించనున్నారు.
మారిన పరీక్షల కొత్త తేదీల వివరాలు
- SSC Junior Engineer (JE) 2026 రాత పరీక్ష తేదీలు: నవంబర్ 2–6, నవంబర్ 30–డిసెంబర్ 1
- ఢిల్లీ పోలీస్, CAPF SI 2026 రాత పరీక్ష తేదీలు: నవంబర్ 23–28
అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ చెక్ చేయండిలా..
అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సందర్శించి తాజా పరీక్షల షెడ్యూల్‌ను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని నోటీసు బోర్డులో ‘Important Notice – Revised dates for Junior Engineer Examination, 2026 and Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2026’ అనే ప్రకటనను ఓపెన్ చేసి పూర్తి వివరాలను పరిశీలించాలి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మారిన తేదీలను గమనించి, తమ పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
