రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు

|

Mar 08, 2021 | 5:59 PM

Anshuman Singh passes away: రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న అన్షుమాన్ సోమవారం తుదిశ్వాస విడిచారు. లక్నోలోని సంజయ్ గాంధీ..

రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు
Follow us on

Anshuman Singh passes away: రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న అన్షుమాన్ సోమవారం తుదిశ్వాస విడిచారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 86 ఏళ్లు. కాగా.. అన్షుమాన్ సింగ్ అంత్యక్రియలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అన్షుమాన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే.. అన్షుమాన్ సింగ్ మృతికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పలువురు బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రిటైర్డ్ న్యాయవాది అయిన అన్షుమాన్ సింగ్ 1999 జనవరి 16న రాజస్థాన్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి 2003 మే వరకూ కొనసాగారు. 1935లో అలహాబాద్ (ప్రస్తుత ప్రయోగ్‌రాజ్) లో ఆర్ట్స్ అండ్ లా పూర్తిచేశారు. 1957లో అలహాబాద్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేశారు. 1984లో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా సేవలందించారు.

Also Read:

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి