దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు . బెంగాల్ లోని జంగి పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈయన లోగడ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. కానీ ఆ పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చిన ఈయన కొన్ని వారాలుగా టీఎంసీలో చేరడానికి అనువుగా ఈ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఈ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ని కోల్ కతా లో కలుసుకుని.. మళ్ళీ తన మనసులోని మాటను బయట పెట్టారు. తొలుత ఇంజనీరుగా ఉన్న అభిజిత్ ముఖర్జీ ఆ తరువాత రాజకీయాల్లో చేరారు . 2012 లో జంగీ పూర్ లోక్ సభ స్థానాన్ని తన తండ్రి వెకేట్ చేయడంతో ఈయన ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి తిరిగి విజయం సాధించారు.తన స్నేహితుడు జితిన్ ప్రసాద మాదిరి తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఆయన గత జూన్ లో ప్రకటించారు.
పైగా తృణమూల్ కాంగ్రెస్ లో గానీ, మరే ఇతర పార్టీలో కూడా చేరబోనన్నారు. ఇలా అని వస్తున్న వార్తలు నిజం కావని చెప్పారు కూడా.. అయితే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపి నేడు ఈ పార్టీలో చేరారు. కాగా జితిన్ ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.