యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా యోగి పలు అప్రజాస్వామిక చర్యలకు, అనుచిత పనులకు పాల్పడ్డారని, ఆయన పాలన పట్ల ప్రజలు విసుగెత్తి పోయారని అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఆరోపించారు. అందువల్లే తన భర్త ఆయనపై పోటీ చేయదలిచారని ఆమె అన్నారు. యోగి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తన భర్త కూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతారని ఆమె చెప్పారు. ఇది నైతిక విలువలకు సంబంధించిన సమస్య అని…తప్పుడు చర్యల పట్ల ఠాకూర్ ఎప్పుడూ నిరసన వ్యక్తం చేస్తుంటారని, వాటిని వ్యతిరేకిస్తుంటారని ఆమె అన్నారు. కాగా రాజకీయాల్లో ప్రవేశించాలని తాను నిర్ణయించుకోవడంతో గత మార్చి 23 న కేంద్ర హోమ్ శాఖ తనను నిర్బంధంగా పదవీ విరమణ చేయించిందని ఈ మాజీ పోలీసు అధికారి తెలిపారు. నిజానికి ఈయనకు మరో ఏడేళ్ల సర్వీసు ఉంది. ఇక్కడ యూపీ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించవలసి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2015 లో ఏదో చిన్న కారణానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ అధికారిని బెదిరించారు. తనను ఆయన బెదిరించారని ఆరోపించినందుకు ఈయనను పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో తెర వెనుక ములాయం హస్తం ఉండవచ్చునని వీరు అనుమానించారు.
ఈ వ్యవహారంపై అప్పట్లో విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కాగా తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ అమితాబ్ ఠాకూర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లక్నో బెంచ్ కి ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్.. 2015 అక్టోబరు నుంచి వర్తించేట్టు ఈయనకు పూర్తి వేతనాలు చెల్లించాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ విధమైన రాజకీయాలను ఎదిరించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేయదలిచానని ఆయన అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.
జోకర్ దొంగ..పోలీసులకే ఛాలెంజ్..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.