ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. మాజీ సీఎంకు నాలుగేళ్ల జైలు శిక్ష

|

May 27, 2022 | 4:34 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హ‌ర్యానా(Haryana) మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాకుండా రూ.50 ల‌క్షలు జ‌రిమానా విధిస్తూ ఢిల్లీ కోర్టు(Delhi Court) తీర్పు వెలువ‌రించింది. చౌతాలాకు చెందిన...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. మాజీ సీఎంకు నాలుగేళ్ల జైలు శిక్ష
Choutala
Follow us on

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హ‌ర్యానా(Haryana) మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాకుండా రూ.50 ల‌క్షలు జ‌రిమానా విధిస్తూ ఢిల్లీ కోర్టు(Delhi Court) తీర్పు వెలువ‌రించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తుల‌నూ స్వాధీనం చేసుకోవాల‌ని అధికార యంత్రాంగానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియ‌మించార‌న్న కేసులో ఇప్పటికే దోషిగా తేలి ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి ఏడాది క్రిత‌మే చౌతాలా విడుద‌ల‌య్యారు. ఈ క్రమంలో ఇంత‌కుముందే ఆయ‌న‌పై దాఖ‌లైన ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసులోనూ విచార‌ణ వేగం పుంజుకుంది. ఈ కేసుపై గ‌త వార‌మే విచార‌ణ‌ ముగించిన కోర్టు చౌతాలాను దోషిగా తేల్చింది. ప‌దేళ్లు జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చి, ఏడాది కాక‌ముందే మ‌రో కేసులో దోషిగా తేలిన ఆయ‌నకు ఈ సారి ఏ త‌ర‌హా శిక్ష ప‌డుతుందోన‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నయాన్న ఆరోప‌ణ‌ల‌పై చౌతాలాపై గ‌తంలో కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శ‌నివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఆయనకు నాలుగేళ్ల శిక్ష, రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి