Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత..

|

Dec 20, 2024 | 1:06 PM

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు.. శుక్రవారం (డిసెంబరు 20) నాడు గురుగ్రామ్‌లో తుదిశ్వాస విడిచారు.. ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో మరణించారని ఐఎన్‌ఎల్‌డి పార్టీ అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత..
Om Prakash Chautala
Follow us on

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు.. శుక్రవారం (డిసెంబరు 20) నాడు గురుగ్రామ్‌లో తుదిశ్వాస విడిచారు.. ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో మరణించారని ఐఎన్‌ఎల్‌డి పార్టీ అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని.. ఐఎన్‌ఎల్‌డి పార్టీ నేతలు వెల్లడించారు. ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తంచేశరాు..

కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఓం ప్రకాష్ చౌతాలా చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. సిర్సాలోని చౌతాలా గ్రామంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చారు..

భారత మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా.. హర్యానాకు ఏడవ ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.. మొత్తంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.. 1989 నుంచి 1991 వరకు మూడు సార్లు సీఎంగా ఎన్నికయ్యారు.. 1999 నుంచి 2005 వరకూ ఫుల్ టైం సీఎంగా పనిచేశారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు 27 మే 2022న 16 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. 87 ఏళ్ల వయస్సులో ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. 2020లో విడుదలయ్యారు..

ఓం ప్రకాష్ చౌతాలా భార్య స్నేహ లత ఆగస్టు 2019లో మరణించారు. చౌతాలాకు అభయ్ సింగ్ చౌతాలా, అజయ్ సింగ్ చౌతాలాతో సహా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అభయ్ సింగ్ చౌతాలా హర్యానాలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే.. అక్టోబర్ 2014 నుంచి మార్చి 2019 వరకు హర్యానా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.

ఓం ప్రకాష్ చౌతాలా మనవడు, దుష్యంత్ చౌతాలా, జననాయక్ జనతా పార్టీ నాయకుడు, హర్యానా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో హిసార్ నియోజకవర్గం నుంచి కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..