Uttar Pradesh: మనుషులను చంపి తింటూ.. రెండేళ్లుగా భయభ్రాంతులకు గురి చేస్తూ.. ఆఖరుకు

|

Jun 28, 2022 | 7:26 PM

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri) లో మనుషులను చంపి తింటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఆడపులిని అధికారులు బంధించారు. ఇప్పటివరకు 21 మందిని ఈ పులిని చంపినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు ....

Uttar Pradesh: మనుషులను చంపి తింటూ.. రెండేళ్లుగా భయభ్రాంతులకు గురి చేస్తూ.. ఆఖరుకు
Bengal Tiger
Follow us on

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri) లో మనుషులను చంపి తింటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఆడపులిని అధికారులు బంధించారు. ఇప్పటివరకు 21 మందిని ఈ పులిని చంపినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు ఉపశమనం లభించింది. ఇనుప బోనులో పులిని (Tiger) నిర్బంధించినట్లు దుధ్వా ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు. కొద్దిరోజుల పాటు పులిని అందులోనే ఉంచనున్నట్లు చెప్పారు. దాని ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్యులు, వన్యప్రాణి నిపుణుల సంరక్షణలో పులిని ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇన్నాళ్లూ మనుషులను చంపి తిన్న పులి ఇదేనా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దుధ్వా టైగర్ రిజర్వ్​ ప్రాంతంలో గడిచిన రెండేళ్లుగా పులులు సంచరించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నిసార్లు అవి బయటకు వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో 21 మంది పులి దాడుల్లో చనిపోయారు. గడిచిన ఒక్కవారంలోనే ఐదుగురు మరణించారు. దీంతో అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి స్పందించిన నేపథ్యంలో దుధ్వా టైగర్ రిజర్వ్ యంత్రాంగం, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో పులిని బంధించింది. ఈ ప్రాంతంలో రెండు ఆడ పులుల ఆనవాళ్లు కెమెరాల్లో కనిపించాయని అధికారులు తెలిపారు. అందులో ఒకటి చిన్న పులి అని చెప్పారు. గతేడాది ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం… 1973లో మనకు కేవలం తొమ్మిది టైగర్‌ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది. మనదేశంలోని 18 రాస్ట్రాలలో టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లు ఉన్నాయిభారత ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పదేళ్లలో పులుల సంఖ్య 1,796 నుంచి 2,967కి చేరినట్లు కేంద్రం ప్రకటించింది. మరే దేశంలోనూ ఇన్ని పులులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో 526, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్‌ లో 442, మహారాష్ట్రలో 317, తమిళనాడులో 264, కేరళలో 190, అస్సాంలో 190, ఉత్తరప్రదేశ్‌ లో 173, రాజస్థాన్‌ లో 91, పశ్చిమబెంగాల్‌ లో 88 పులులు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి టైగర్‌ రిజర్వులు ఉన్న 13 దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని కేంద్రం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం