Midnapore: పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగు.. సురక్షితంగా కాపాడిన అటవీ అధికారులు

|

Feb 26, 2021 | 7:54 AM

Elephant rescued: అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు పట్టణంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు రెస్క్యూ నిర్వహించి ఆ ఏనుగును..

Midnapore: పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగు.. సురక్షితంగా కాపాడిన అటవీ అధికారులు
Follow us on

Elephant rescued: అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు పట్టణంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు రెస్క్యూ నిర్వహించి ఆ ఏనుగును సురక్షితంగా కాపాడారు. ఈ సంఘంటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. అడవి ప్రాంతం నుంచి ఓ ఏనుగు రాత్రి వేళ మిడ్నాపూర్ పట్టణంలోని వైద్యకళాశాల ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చింది. దీంతో ఏనుగును దగ్గరగా చూసేందుకు పెద్దసంఖ్యలో పట్టణ ప్రజలు తరలివచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ నిర్వహించారు.

ప్రజలను చూసి ఏనుగు బెదిరిపోకుండా ఉండేందుకు అందరినీ అప్రమత్తం చేయడంతోపాటు సిబ్బందిని చూట్టూ మోహరించారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఏనుగుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని క్రేన్ సహాయంతో ట్రక్కులోకి ఎక్కించారు. ప్రస్తుతం ఈ ఏనుగును రెండు రోజులపాటు పశువైద్యాధికారుల పరిశీలనలో ఉంచనున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. అనంతరం ఏనుగును అటవీ ప్రాంతానికి తరలించనున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ వెల్లడించారు.

Also Read: