Bigg Boss 7: వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి మరీ..

Bigg Boss Tamil 7 winner Archana Ravichandran: తమిళ బిగ్‌బాస్ 7 టైటిల్‌ విన్నర్ అర్చన రవిచంద్రన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఆమె, అన్నామలైయర్ ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీశాఖ అనుమతి లేకుండా పర్వత శిఖరం ఎక్కడంతో పాటు, ఇతరులను ప్రోత్సహించడంపై తీవ్ర దుమారం రేగింది.దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Bigg Boss 7: వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి మరీ..
Archana Ravichandran

Updated on: Jan 28, 2026 | 4:11 PM

విజయ్ టీవీలో ప్రసారమయ్యే రాజా రాణి పార్ట్ 2 సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అర్చన రవిచంద్రన్.. ఈ సీరియల్‌లో తను చేసిన విలన్ పాత్రతో చాలా మంది అభిమానులను సొంత చేసుకుంది. చేసింది నెగిటివ్‌ రోల్ అయినా.. తన యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయిపోయారు. ఈ యాక్టింగే ఆమెకు తమిళ స్మాల్ స్క్రీన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన షో బిగ్ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అయితే వైల్డ్‌కార్డుతో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్చన ఏకంగా సీజన్ 7టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఆమె తమిళ బిగ్‌బాస్ చరిత్రలోనే వైల్డ్‌కార్డుతో ఎంట్రి ఇచ్చి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన ఏకైక కంటెస్టెంట్‌గా నిలించింది.

వైల్డ్‌కార్డుతో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్చన విజయానికి ప్రదీప్ ఆంటోనీ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రదీప్‌గా సపోర్ట్‌గా ఉన్నందునే వైల్డ్‌ కార్డు ఎంట్రీతో వచ్చినా.. ఆమెను ప్రేక్షకులు బాగా ఆదారించారనే టాక్ కూడా నడిచింది. అయితే ఇటీవలే నటి అర్చన రవిచంద్రన్, నటుడు అరుణ్ కుమార్ లకు నిశ్చితార్థం జరిగింది. వాళ్ల నిశ్చితార్థం ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అంతా హ్యాపీగా సాగుతున్న క్షణాల్లో అర్చన మరో వివాధంలో చిక్కుకున్నారు.

అన్నామలైయర్ ఆలయంలో నిషేధాన్ని ఉల్లంఘించిన బిగ్ బాస్ అర్చన రవిచంద్రన్:

నిబంధనలకు విరుద్దంగా నటి అర్చన రవిచంద్రన్ అన్నామలైయర్ ఆలయంలో నిషేధాన్ని ఉల్లంఘించారణి అటవీశాఖ అధికారులు ఆరోపించారు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అన్నామలైయర్ ఆలయంలోని పర్వత శిఖరానికి వెళ్లారని.. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి.. నెటిజన్లను పర్వత్వం ఎక్కేలా ప్రోత్సహించదని ఆరోపణలు ఉన్నాయి. ఆమో అనుమతి లేకుండా పర్వతాలు ఎక్కడమే కాకుండా, ఇతరులను పర్వతాలు ఎక్కడానికి ప్రోత్సహించడం గురించి మాట్లాడటం కూడా వివాదానికి దారితీసింది. ప్రస్తుతం అటవీ శాఖ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.