Forest Area: దేశంలో అటవీ విస్తీర్ణంలో పెరుగుదల.. ఏపీ తెలంగాణాల్లో అత్యధికం

|

Jan 14, 2022 | 7:51 AM

గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది.

Forest Area: దేశంలో అటవీ విస్తీర్ణంలో పెరుగుదల.. ఏపీ తెలంగాణాల్లో అత్యధికం
Forest Area
Follow us on

గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం(Forest Area) పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈశాన్య ప్రాంతంలో తగ్గుదల కనిపించింది. 2019తో పోలిస్తే దేశంలోని మడ అడవుల విస్తీర్ణం 17 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్(India State of Forest) రిపోర్ట్‌లో దేశంలోని అటవీ ప్రాంతానికి సంబంధించిన విషయాలను ప్రచురించారు. ఈ నివేదిక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తయారు చేస్తారు. ఈ నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణాల్లో గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం బాగా పెరిగింది. అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు.. వన రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని దీనిని బట్టి అర్ధం అవుతోంది. అదేవిధంగా ఒడిసా రాష్రంలో కూడా అటవీ విస్తీర్ణం ఈ రెండు సంవత్సరాలలో వృద్ధిని కనబరిచింది.

ఈశాన్య రాష్ట్రాల్లో సముద్రపు తుపానులు పెరగడం, వర్షాలు కురవకపోవడం అడవుల విస్తీర్ణంలో మార్పులకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. తొలిసారిగా టైగర్ కారిడార్ అటవీ ప్రాంతాన్ని కూడా అంచనా వేశారు. దేశంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతం 74.5% అటవీ ప్రాంతం. కారిడార్‌లోని అటవీ ప్రాంతం దశాబ్దంలో 37.15 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.

కాగా నగరాల వారీగా చూసుకుంటే.. హైదరాబాద్ టాప్ లో నిలిచింది. ఇక్కడ 250 శాతం మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. ఇక ఢిల్లీ లో 11 శాతం, చెన్నై లో ౨౬ శాతం, ముంబాయి లో 9 శాతం, బెంగళూరులో 5 శాతం, కోల్ కతా లో 30 శాతం మేర అటవీ ప్రాంతం పెరిగిందని నివేదిక పేర్కొంది. అయితే, అహ్మదాబాద్ లో ఇదే సమయంలో 48 శాతం మేర అటవీ ప్రాంతం తగ్గిపోవడం గమనార్హం.

ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాల తరువాత అధికంగా కేరళలో 109 చదరపు కిలోమీటర్ల మేర అటవీ అభివృద్ధి కనిపించింది. అలాగే చత్తీస్ గడ్ లో 106 చదరపు కిలోమీటర్లు, బీహార్ లో 75 చదరపు కిలోమీటర్లు.. గుజరాత్ లో 69 చదరపు కిలోమీటర్లు మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!