ఈ భయంకరమైన కోవిడ్ తరుణంలో మాస్కులు ధరించనిదే అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. కరోనా వైరస్ కి గురి కాకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా డాక్టర్లు, వైద్య సిబ్బంది, నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే సాక్షాత్తూ ఓ డాక్టరే ఫేస్ మాస్క్ ధరించడమన్నది మూర్ఖపు రూల్ అని, తాను దీన్ని ధరించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెబుతున్నాడు. కర్నాటక లోని మంగుళూరులో షాపింగ్ మాల్ కి వెళ్లిన ఈ వైద్యుడి వింత పోకడ ఇది.. మాల్ అంతా వితౌట్ మాస్క్ కలియదిరిగి తనకు అవసరమైన వస్తువులు కొన్న అనంతరం బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి మాల్ సిబ్బంది..దయచేసి మాస్క్ ధరించాలని కోరగా..వారితో ఆయన తగువు పెట్టుకున్నాడు. ఇది ఫులిష్ రూల్ అని, తను కోవిద్ నుంచి పూర్తిగా కోలుకున్నానని, తనకు మాస్క్ అవసరం లేదని ఆయన దురుసుగా చెప్పాడు. మాల్ మేనేజర్ వచ్చి సర్ది చెప్పబోయినా ఆ డాక్టర్ వినలేదు. అడ్డంగా వాదించాడు. దీంతో సిబ్బంది ఆ డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాకీలు అతనిపై ఎపిడమిక్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన చిరునామా తెలుసుకునే పనిలో పడ్డారు. అయినా ఆ షాపింగ్ మాల్ బయట నో మాస్క్, నో పర్మిషన్ అని బోర్డు ఉన్నా ఇదంతా జరిగింది. డాక్టర్ మాల్ లోకి మాస్క్ లేనిదే ప్రవేశించినప్పుడే వారు అభ్యంతరం చెప్పాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
అసలే కర్ణాటకలో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 30,309 కేసులు నమోదయ్యాయి. 525 మంది కోవిద్ రోగులు మృతి చెందారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )
NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్