Khichdi: కిచిడీ తిని 20 మందికి అస్వస్థత.. ముగ్గురి పరిస్థితి విషమం

|

Mar 27, 2023 | 11:25 AM

కిచిడీ తిని 20 మంది పిల్లలు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లోని నానానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ దేవాలయం వసంత నవరాత్రి సందర్భంగా జరిగిన కమ్మునిటీ విందులో కిచిడి తిని పెద్దలతోపాటు..

Khichdi: కిచిడీ తిని 20 మందికి అస్వస్థత.. ముగ్గురి పరిస్థితి విషమం
Food Poisoning
Follow us on

కిచిడీ తిని 20 మంది పిల్లలు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లోని నానానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ దేవాలయం వసంత నవరాత్రి సందర్భంగా జరిగిన కమ్మునిటీ విందులో కిచిడి తిని పెద్దలతోపాటు 20 మంది పిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాదితులను బాగ్‌పత్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన పిల్లలు, పెద్దల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఎస్‌కే చౌదరి మాట్లాడుతూ.. ఆలయంలో కిచిడీ తిని పిల్లలు, పెద్దలకు మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన మీడియకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.