Zomato: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇకపై ఆర్డర్‌ చేసేముందు ఆ ఆప్షన్‌.

|

Aug 31, 2021 | 7:27 AM

Zomato: రోజురోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. సౌకర్యం పేరిట అన్ని వస్తువులు ప్లాస్టి్‌క్‌తో తయారు చేసే రోజులు వచ్చేశాయి. దీంతో ఇప్పుడు...

Zomato: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇకపై ఆర్డర్‌ చేసేముందు ఆ ఆప్షన్‌.
Zomato Plastic Free
Follow us on

Zomato: రోజురోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. సౌకర్యం పేరిట అన్ని వస్తువులు ప్లాస్టి్‌క్‌తో తయారు చేసే రోజులు వచ్చేశాయి. దీంతో ఇప్పుడు ఇదే మహా భూతంగా మారి యావత్‌ మానవాళి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. అయితే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటే ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అందరికీ తెలిసిందే. కానీ మనవాల్లే అంతా మారుతుందా అని భావించే వారు ఎక్కువ ఉండేసరికి ప్లాస్ట్‌ ఉపద్రవంలా మారుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివర్‌ యాప్‌ జొమాటో ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించేందుకు తనవంతు కృషి చేస్తోంది. సాధారణంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్తువులే ఉపయోగిస్తారు. దీంతో ప్లాస్టిక్‌ వెయిస్టేజ్‌ ఎక్కువవుతోందని మనందరికీ తెలిసిందే.

తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్ ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఇకపై జొమాటో యాప్‌లో ఆర్డర్‌ చేసేప్పుడు ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫోర్క్స్‌ వద్దనుకునే వారి కోసం ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్‌ చేసే ముందు ప్లాస్టిక్‌ స్పూన్‌లను స్కిప్‌ చేసే అవకాశాన్ని కలిపించారు. ఇకపై కస్టమర్‌ కావాలనుకుంటేనే ప్లాస్టిక్‌ స్పూన్‌లు, ఫోర్క్స్‌ ఇస్తార్నమాట.

ఈ విషయమై దీపిందర్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ చిన్న మార్పుతో పర్యావరణాన్ని కాపాడొచ్చు. మీరు ఇలా చేయాలనుకుంటే.. దయచేసి కట్లరీకి నో చెప్పి మీ వంతు సాయం చేయండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న కారణాన్ని తెలుపుతూ.. ఇటీవల వేల మంది కస్టమర్లతో నిర్వహించిన ఓ సర్వేలో 90శాతం మంది తమకు ప్లాస్టిక్‌ వస్తువులు వద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్‌ వాళ్లకు ఒక్కో ఆర్డర్‌ నుంచి రూ. 2 నుంచి 5 వరకు ఖర్చు మిగలనుందని చెప్పుకొచ్చారు.

Also Read: Afghanistan Crises: డెడ్‌లైన్‌కి ఒక రోజు ముందే ఆఫ్ఘాన్‌ను వీడిన అమెరికా.. కాబూల్ విమానాశ్రయాన్ని వీడి తిరుగుముఖం పట్టిన ఆర్మీ

Nani: అభిమానులకు సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..

China Video Games: ఆన్‌లైన్‌ గేమ్స్‌ కట్టడికి చైనా కీలక నిర్ణయం.. ఇకపై వారంలో కేవలం మూడు గంటలే.