ఎంత ఘోరం.. సర్కార్ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం.. ఏకంగా ఐదుగురు పేషెంట్లు మృతి
సర్కార్ ఆస్పత్రుల్లో ఏం జరుగుతుందో పై స్థాయిలో తెలియకపోవచ్చు.. కానీ, కిందిస్థాయి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో వైద్యలు, నర్సులు పేద రోగుల ప్రాణాలు తీస్తున్నారు. అవును.. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఒడిశాలో జరిగి ఒక దారుణ సంఘటన. ఒక నర్సు చేసిన నిర్లక్ష్యం ఖరీదు ఐదుగురు రోగుల ప్రాణం తీసింది.పూర్తి వివరాల్లోకి వెళితే..

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే నానుడిని నిజం చేస్తున్నాయి.. పలుచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వాకంతో. కూలీనాలీ చేసుకుంటూ జీవించే ఎందరో పేద ప్రజలు ఆరోగ్యం బాగాలేకపోతే, ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ, అక్కడి వైద్యులు, నర్సులు, సిబ్బంది పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో ఏం జరుగుతుందో పై స్థాయిలో తెలియకపోవచ్చు.. కానీ, కిందిస్థాయి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో వైద్యలు, నర్సులు పేద రోగుల ప్రాణాలు తీస్తున్నారు. అవును.. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఒడిశాలో జరిగి ఒక దారుణ సంఘటన. ఒక నర్సు చేసిన నిర్లక్ష్యం ఖరీదు ఐదుగురు రోగుల ప్రాణం తీసింది.పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మమ్ నాయక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మంగళవారం(జూన్3) అర్ధరాత్రి జరిగిన సంఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఐదుగురు రోగులకు ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపై వీరిలో ముగ్గురిని ఐసీయూలోనూ మిగతా ఇద్దరిని సర్జికల్ వార్డులో అబ్జర్వేషన్‌లో ఉంచారు.. అయితే ఎప్పటిలాగే మంగళవారం రోజు రాత్రి11 గంటలకు డ్యూటీలో ఉన్న సిబ్బంది.. వీరికి రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేశారు. అంతే.. అప్పటి వరకు బాగానే ఉన్న ఈ రోగులు అంతా.. సూది వేసిన కొన్ని క్షణాల్లోనే నొప్పితో విలవిల్లాడిపోయారు. నొప్పి తట్టుకోలేక అల్లాడిపోయారు. ఇది గమనించిన తోటి రోగులు, వారి అటెండర్లు వెంటనే డాక్టర్ వద్దకు పరిగెత్తారు..కానీ, డాక్టర్ వచ్చేలోగానే వారంతా కన్నుమూశారంటూ మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రోధించారు.
ఆపరేషన్ తరువాత ఆరోగ్యంగా ఉన్న తమ వారు డ్యూటీలో ఉన్న నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ తరువాతే అస్వస్థతకు గురైనట్టుగా ఆరోపించారు. సూదిమందు వేసిన నిమిషాల్లో వారంతా చనిపోయారంటూ బోరున విలపించారు. ఐదుగురి మృతికి కారణమైన నర్సుతో పాటు ఇతర ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారికి పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




