Odisha Train Accident: 51 గంటల్లోనే ట్రాక్‌పై ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం అతి పెద్ద విషాదంగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బాలాసోర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌ వద్ద యశ్వంత్‌పూర్‌, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్సు రైలు ఢీకొన్న విషయం తెలిసిందే.

Odisha Train Accident: 51 గంటల్లోనే ట్రాక్‌పై ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
Goods Train

Updated on: Jun 05, 2023 | 12:51 PM

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం అతి పెద్ద విషాదంగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బాలాసోర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌ వద్ద యశ్వంత్‌పూర్‌, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్సు రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించడం మొదలయ్యాయి.

బాహనాగ్‌ స్టేషన్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి 10.40 PM గంటలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మొదటి గూడ్సు రైలు రాకపోకలను ప్రారంభించారు. ఆ రైలు విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకెళ్తోంది.  ఆ తర్వాత సోమవారం ప్యాసెంజర్ రైలు కూడా వెళ్లింది.  మరో రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..