AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది.

Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..
Delhi Blast
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2025 | 11:01 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది. వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్‌ అయినట్టు గుర్తించిన పోలీసులు.. కారు యజమానిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్‌గా గుర్తించారు. NSG కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో ఉగ్రవాద ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు. దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర CCTV ఫూటేజీ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపింది ఫోరెన్సిక్ బృందం.

అయితే.. వైట్ హ్యుందాయ్ ఐ20 కారుకు సంబంధించి సీసీటీవీ వీడియోను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మూలాల ప్రకారం, HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటలకు పైగా నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరింది. దాదాపు ఒక నిమిషం నిడివి గల క్లిప్‌లో కారు బదర్‌పూర్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది.. పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చేయి కిటికీపై ఉంచి కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశిస్తున్నట్లు ఒక చిత్రం చూపిస్తుంది. ఆ కారు డ్రైవర్ నీలం, నలుపు రంగు టీ-షర్టు ధరించి ఉన్నట్లు చెబుతున్నారు. కారు పార్క్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదని వర్గాలు తెలిపాయి. అతను ఎవరికోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు. హ్యుందాయ్ ఐ20 కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు, ఫోరెన్సిక్ ఆధారాలు – నిఘా సంస్థలు ఉగ్రవాద సంబంధాలను సూచించిన తర్వాత ఢిల్లీ పోలీసులు UAPA (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) సెక్షన్లను ప్రయోగించారు. ఢిల్లీ – సమీప రాష్ట్రాలైన ముంబై, కోల్‌కతా, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే.. ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్‌లో రాజధాని నుండి కేవలం 50 కి.మీ దూరంలో 2,900 కిలోల పేలుడు పదార్థాల భారీ నిల్వ దొరికిన రోజే ఈ సంఘటన జరిగడంతో.. అనుమానాలు పెరిగాయి.. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడు కలిగి ఉన్న i20 కారు కారణంగా పేలుడు – “వైట్ కాలర్” టెర్రర్ మాడ్యూల్ మధ్య లింక్ బయటపడిందని వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us