Sabarimala: శబరిమల ఆలయానికి సమీపంలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

పటాకులు నింపుతుండగా ప్రమాదవశాత్తు పటాకులు పేలిపోవడంతో పటాకుల యూనిట్‌లోని ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని అరక్కోణం క్యాంపు కు తరలించారు. ఈ  ప్రమాదం కారణంగా అర్దాంతరంగా వేడుకలు నిలిపివేశారు. 

Sabarimala: శబరిమల ఆలయానికి సమీపంలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
Shabarimala Hills

Edited By: Janardhan Veluru

Updated on: Jan 03, 2023 | 11:07 AM

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల గిరుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల కొండ వద్ద ఉన్న ఆలయంలో బాణా సంచా తయారీ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాళిగపురం వద్ద ఆలయ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పటాకులు నింపుతుండగా ప్రమాదవశాత్తు పటాకులు పేలిపోవడంతో పటాకుల యూనిట్‌లోని ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని అరక్కోణం క్యాంపు కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  ప్రమాదం కారణంగా అర్దాంతరంగా వేడుకలు నిలిపివేశారు.

భక్తుల రద్దీకి కొంత దూరంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మలికప్పురం (ఆలయ సముదాయంలోని ఒక చిన్న మందిరం) సమీపంలో ఉద్యోగులు “కఠిన” (ఒక విధమైన పైరో-టెక్నిక్ నైవేద్యం) నింపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆలయ బోర్డు అధికారి తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆలయ వ్యవహారాల మంత్రి కె. రాధాకృష్ణన్‌ ఆలయ బోర్డు నుంచి నివేదిక కోరారు.

ప్రస్తుతం శబరిమల ఆలయంలో అసాధారణ రద్దీ నెలకొంది. అనేక సందర్భాల్లో తొక్కిసలాట వంటి పరిస్థితులు తలెత్తడంతో ఆలయ బోర్డు రోజులో పాదయాత్ర చేసే భక్తుల సంఖ్యను పరిమితం చేసింది. రోజుకి 90,000 మందికి మాత్రమే పాదయాత్ర చేసే అవకాశం కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..