Breaking: సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు..

|

Jan 21, 2021 | 4:28 PM

Serum Institute of India: మహారాష్ట్రలోని పూణే సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1...

Breaking: సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు..
Serum Institute of India
Follow us on

Serum Institute of India: మహారాష్ట్రలోని పూణే సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

టెర్మినల్1 వద్ద ఉన్న SEZ3 బిల్డింగ్ నాలుగు, ఐదు అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయని తెలుస్తోంది. అక్కడ రిట్రో వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు సమాచారం. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని.. కోవిడ్ వ్యాక్సిన్, దానిని తయారు చేస్తున్న యూనిట్‌ సురక్షితంగానే ఉన్నట్లు సీరమ్ సంస్థ పేర్కొంది.

Also Read:

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..