Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజ‌న్లు..

|

Jun 17, 2021 | 12:33 AM

Fire Accident In Delhi AIIMS: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆస్ప‌త్రిలోని ఓ భ‌వ‌నంలో బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌జ‌ర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంత‌స్తులో ఒక్క‌సారిగా...

Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజ‌న్లు..
Fire Accident
Follow us on

Fire Accident In Delhi AIIMS: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆస్ప‌త్రిలోని ఓ భ‌వ‌నంలో బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌జ‌ర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంత‌స్తులో ఒక్క‌సారిగా మంటలు చెల‌రేగాయి. ఇదిలా ఉంటే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం కానీ, గాయాలు కూడా కాలేవ‌ని అధికారులు తెలిపారు.
ఈ విష‌య‌మై ఢిల్లీ ఫైర్ స‌ర్వీస్ అధికారి ఒక‌రు మాట్లాడుతూ.. `రాత్రి 10:30 గంటల సమయంలో ఆగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది.. దీంతో హుటాహుటిన 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాము. మంట‌లు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని` చెప్పుకొచ్చారు. అగ్నిప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’

డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !

Train Ticket: పండగలాంటి అదరిపోయే శుభవార్త.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు రైలులో ప్రయాణించవచ్చు.. కానీ..!