కార్‌ గ్యారేజీలో అర్థరాత్రి మంటలు.. ఖరీదైన కార్లు దగ్ధం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..!

గ్యారేజీలో స్టేటర్ పనిచేస్తుండగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు.

కార్‌ గ్యారేజీలో అర్థరాత్రి మంటలు.. ఖరీదైన కార్లు దగ్ధం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..!
Fire Accident In Car Garage

Updated on: Feb 16, 2023 | 9:05 AM

బెంగళూరులోని కస్తూరినగర్‌, రామ్‌మూర్తినగర్‌లోని ఓ కార్‌ గ్యారేజీలో అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్యారేజీలోని విలువైన లగ్జరీ కార్లు దగ్ధమైనట్టుగా తెలిసింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయినట్టు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో పదికి పైగా కార్లు దగ్ధమైనట్లు సమాచారం .

రామమూర్తినగర్‌లో కస్తూరినగర్‌లోని చాంద్‌పాషాకు చెందిన గ్యారేజీలో ఈ దుర్ఘటన జరిగింది. అర్థరాత్రి గ్యారేజీలో మంటల వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఐదుకు పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి.

ఇవి కూడా చదవండి

గ్యారేజీలో స్టేటర్ పనిచేస్తుండగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ..

Loading...
Unable to load recommendations.
Follow Us