ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మూడు సావనీర్ నాణేలను విడుదల చేశారు. ఇందులో బాల రామయ్య, అయోధ్యలోని రామజన్మభూమి ఆలయం థీమ్ ఆధారంగా ఒకటి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL)కు సంబంధించిన 19వ స్థాపన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయోధ్యలోని రామ్ లల్లా , రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన మూడు స్మారక నాణేలను ఆవిష్కరించారు. బుద్ధుని జ్ఞానోదయం అయిన స్థాప జ్ఞాపకార్థం ద్వి-లోహ కవచమైన సావనీర్ నాణేన్ని, భారతదేశంలో అంతరించిపోతున్న జంతువుల్లో భాగంగా ఖడ్గమృగం ఉన్న మరొక నాణెం.. ఇలా మొత్తం మూడు నాణేలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మాట్లాడుతూ.. SPMCIL సంస్థ విడుదల చేస్తున్న స్మారక స్టాంపులు లేదా నాణేలు తీసుకున్న ఇతివృత్తాలు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ ఆందోళనలు, దివ్యాంగులకు సంబంధించిన ఆందోళనలను తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి నాణేలు బహుమతిగా ఇవ్వడానికి విలువైన వస్తువులుగా మారడానికి తగినంత ఆకర్షణీయంగా మారతాయని పేర్కొన్నారు.
అయితే నాణేలు, స్టాంపులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులకు ఈ స్మారక వెండి, ఆక్సిడైజ్డ్ మెటల్ నాణేలను సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి నామమాత్రపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
Union Finance Minister Smt. @nsitharaman released Coloured Souvenir Coin based on the theme of Ram Lalla and Ram Janmabhoomi Temple, Ayodhya, during the 19th Foundation Day celebrations of the @SPMCILINDIA, via virtual mode, in New Delhi, today. 👇
The coin can availed through… pic.twitter.com/6frlimsSnH
— Ministry of Finance (@FinMinIndia) February 15, 2024
కాగా.. గత నెలలో అయోధ్య బాలరాముడి ఆలయ ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రధాన మోదీ చేతులమీదుగా ఈ మహాత్తర ఘట్టం పూర్తయింది. బాలరాముడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహానికి పాలు, నీరు, గంధం, కుంకుమ ఎన్ని పూసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా రూపొందించారు. అంతేకాదు.. వాటర్ ప్రూఫ్ కారణంగా ఈ విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ విగ్రహం అంతే బలంగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఈ విగ్రహం భద్రంగా ఉంటుంది. బాల రాముడు తామరపువ్వుపై నిలబడి ఉన్నట్లుగా విగ్రహం ఏర్పాటు చేశారు. చిన్ననాటి రాముడు ఎలా ఉన్నాడో భక్తులకు తెలియజేస్తుంది. కర్నాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి విగ్రహాన్ని రూపొందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..