పవర్‌ఫుల్ నిర్మలమ్మ..ఎంట్రీతోనే రికార్డ్
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనత సాధించారు. అత్యంత శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్ రిలీజ్ చేసిన వందమంది మహిళల్లో 34వ స్థానం సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన తొలిసారే..ట్రంప్ కూతురు ఇవాంక, క్వీన్ ఎలిజబెత్, న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్‌లాంటి వారిని వెనక్కి నెట్టేశారు. క్వీన్ ఎలిజబెత్ 38వ స్ధానం..ఇవాంకా ట్రంప్ 42వ స్థానానికే పరిమితమయ్యారు. ఈ జాబితాలో భారత్ నుంచి మరో ముగ్గురు మహిళలు చోటు […]
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనత సాధించారు. అత్యంత శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్ రిలీజ్ చేసిన వందమంది మహిళల్లో 34వ స్థానం సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన తొలిసారే..ట్రంప్ కూతురు ఇవాంక, క్వీన్ ఎలిజబెత్, న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్‌లాంటి వారిని వెనక్కి నెట్టేశారు. క్వీన్ ఎలిజబెత్ 38వ స్ధానం..ఇవాంకా ట్రంప్ 42వ స్థానానికే పరిమితమయ్యారు.
ఈ జాబితాలో భారత్ నుంచి మరో ముగ్గురు మహిళలు చోటు దక్కించుకున్నారు. వారిలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ రోష్ని నాదర్ మల్హోత్రా 54 వ స్థానంలో నిలవగా, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. రేణుకా జగిత్యాణి 9వ స్థానంలో ఉన్నారు. ఇక జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2, యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి 3, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ 4, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బార్రా 5వ స్థానాన్ని దక్కించుకున్నారు.
టేలర్ స్విఫ్ట్ 71, సెరెనా విలియమ్స్ 81, రీస్ విథర్స్ స్పూన్ 90, స్వీడిష్‌బాలిక గ్రెటా థన్‌బెర్గ్..16 ఏళ్లకే ఈ జాబాతాలో 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ఫోర్బ్స్ జాబితాలో ఉత్తర అమెరికా నుంచి అత్యధికంగా 50 మంది..ఆసియా ఫసిపిక్ ప్రాంతం నుంచి 21మంది..యూరప్ నుంచి 18మంది..యూకే నుంచి 5మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జాబితాలో 23మంది కొత్తగా స్థానం సంపాదించారు. వారిలో నిర్మలా సీతారామన్ ఒకరు.