పాక్ వెళ్లినందుకు క్షమించండి.. సింగర్ మికాసింగ్

| Edited By:

Aug 22, 2019 | 3:48 AM

ముంబయి: బాలీవుడ్ నేపధ్య గాయకుడు మికాసింగ్ క్షమాపణలు చెప్పాడు. ఆగస్టు 8న పాకిస్తాన్‌లో ప్రదర్శన ఇవ్వడంపై బాలీవుడ్ సినీ కార్మికుల సంఘం ఆయనపై వేటు వేస్తూ ప్రకటించింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆయనపై ఉన్న నిషేదాన్ని రద్దుచూస్తూ “ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్” ప్రకటించింది. కరాచీలో జరిగిన ఓ వివాహ వేడుకలో ప్రదర్శనలో మికాసింగ్ హాజరయ్యారు. దీంతో ఆయనపై ఎఫ్‌డబ్ల్యూసీఈ నిషేదాన్ని విధించింది. తాను అనుకోకుండా ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి […]

పాక్ వెళ్లినందుకు క్షమించండి.. సింగర్ మికాసింగ్
Follow us on

ముంబయి: బాలీవుడ్ నేపధ్య గాయకుడు మికాసింగ్ క్షమాపణలు చెప్పాడు. ఆగస్టు 8న పాకిస్తాన్‌లో ప్రదర్శన ఇవ్వడంపై బాలీవుడ్ సినీ కార్మికుల సంఘం ఆయనపై వేటు వేస్తూ ప్రకటించింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆయనపై ఉన్న నిషేదాన్ని రద్దుచూస్తూ “ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్” ప్రకటించింది. కరాచీలో జరిగిన ఓ వివాహ వేడుకలో ప్రదర్శనలో మికాసింగ్ హాజరయ్యారు. దీంతో ఆయనపై ఎఫ్‌డబ్ల్యూసీఈ నిషేదాన్ని విధించింది.

తాను అనుకోకుండా ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగిందని . తాను చేసిన పొరబాటుపై సమాఖ్యను, దేశాన్ని క్షమాపణలు కోరుతున్నట్టుగా మికా చెప్పాడు.