Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ferrari : వామ్మో..కారుకు 1.42కోట్ల ట్యాక్స్.. వెంటనే కట్టాలన్న అధికారులు..చివరకు..

ఓ వ్యక్తి లగ్జరీ కారు కొని రోడ్లపై చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశాడు. అయితే దానికి రోడ్ ట్యాక్స్ కట్టలేదు. ఇది గుర్తించిన అధికారులు అతడి ఇంటికి వెళ్లి వెంటనే రోడ్ ట్యాక్స్ కట్టాలని.. లేకపోతే కారు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ ట్యాక్స్ లక్షల్లో కాదు కోట్లలో ఉంది. బెంగళూరులో ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

Ferrari : వామ్మో..కారుకు 1.42కోట్ల ట్యాక్స్.. వెంటనే కట్టాలన్న అధికారులు..చివరకు..
Ferrari Car
Krishna S
|

Updated on: Jul 04, 2025 | 9:30 AM

Share

ఓ వ్యక్తి ఫెరారీ కారు కొన్నాడు. దాన్ని వేసుకుని రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగాడు. కొన్ని రోజులు గడిచాక సదరు వ్యక్తి ఇంటికి అధికారులు వెళ్లారు. ఎందుకంటే అతడు రోడ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుక తిరుగుతున్నాడు. ఇది గుర్తించిన అధికారులు అతడిని ట్యాక్స్ కట్టాలని లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేముంది మామూలే కదా అంటారా..? ఇక్కడే దాగుంది అసలు విషయం. ఆ ట్యాక్స్ రూ 1.42 కోట్లు ఉండడమే ఇక్కడ స్పెషల్. పైగా అది కట్టడానికి కొన్ని గంటలే టైమ్ ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న 30 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్లు ట్యాక్స్ తప్పించుకుని హాయిగా ఎంజాయ్ చేసిన వాహన యజమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

కర్ణాటకలో పన్ను ఎగవేతదారులపై అధికారులు కొరడా ఝళిపించారు. వాహనాలకు రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ తో ఓ ఫెరారీ కారు రోడ్లపై తిరుగడాన్ని అధికారులు గుర్తించారు. రూ.7.5 కోట్ల విలువ గల ఈ ఫెరారీ కారుకు సంబంధించి ఎటువంటి రోడ్ ట్యాక్స్ కట్టలేదని తేల్చారు. దీంతో ఆ వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు.. సాయంత్రంలోగా రూ.1.42కోట్లు చెల్లించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో దెబ్బకు దిగొచ్చిన సదరు వ్యక్తి ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాడు. ఈ మధ్య కాలంలో వసూల్ చేసిన అతిపెద్ద వాహన పన్ను రికవరీలో ఇది ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న ఫెరారీ, పోర్షే, ఆడి, రేంజ్ రోవర్లతో సహా 30 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 40 మందికి పైగా RTO అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది.

సాధారణంగా మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఫెరారీ కారుకు రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకు ట్యాక్స్ ఉంటుంది. తెలంగాణలో ఫెరారీ కారుకు దాన్ని ధరలో 13శాతం రోడ్ ట్యాక్స్ గా వసూల్ చేస్తారు. అదేవిధంగా ఏపీలఓ 14శాతం పన్ను వసూల్ చేస్తారు. ఇక మహరాష్ట్రలో ఈ ట్యాక్స్ 18శాతంగా ఉంది. ఏది ఏమైనా కారుకు రూ.1.42కోట్ల ట్యాక్స్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..