Crime news: పెట్రోల్ సీసాలు విసిరి.. వాటర్ కనెక్షన్ కట్ చేసి.. కుమారుడి కుటుంబంపై తండ్రి కర్కశత్వం

|

Mar 19, 2022 | 6:43 PM

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆస్తి కోసం దారుణాలకు తెగబడుతున్నారు. సొంత వాళ్లు, రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు అనే తేడా లేకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు...

Crime news: పెట్రోల్ సీసాలు విసిరి.. వాటర్ కనెక్షన్ కట్ చేసి.. కుమారుడి కుటుంబంపై తండ్రి కర్కశత్వం
Kerala Murder
Follow us on

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల కంటే మనీ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆస్తి కోసం దారుణాలకు తెగబడుతున్నారు. సొంత వాళ్లు, రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు అనే తేడా లేకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారితో గొడవలు(Conflicts) పడి దాడులూ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు హత్యలకూ వెనుకాడటం లేదు. కేర‌ళ‌లోని ఇడుక్కి జిల్లాలో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. గదిలో నిద్రిస్తున్న కుమారుడి కుటుంబాన్ని తండ్రి దారుణంగా హత్య(Murder) చేశాడు. గదిలో పెట్రోల్ సీసాలు విసిరి, వాటర్ కనెక్షన్ కట్ చేసి దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ (Kerala) లోని ఇడుక్కి జిల్లా తొడుపుజాకు చెందిన ఫైజల్ కు తండ్రి హమీద్ యాభై సెంట్ల భూమి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో వీరు విడివిడిగా నివాసముంటున్నారు. 2018లో హమీద్ తన కుమారుడు ఫైజల్​కి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్​చేశాడు. భూమి తిరిగిచ్చేందుకు ఫైజల్ అంగీకరించలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన హమీద్.. తన కుమారుని కుటుంబాన్ని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఫైజల్ తన భార్య, పిల్లలతో నిద్రిస్తున్న సమయంలో హమీద్ వారి గదికి నిప్పంటించాడు. గదిలో పెట్రోల్ సీసాలు విసిరి వారు బయటకు రాకుండా ఉండేలా చేశాడు. మంటల వేడి తాళలేక బాధితులు బాత్‌రూమ్‌లోకి పరుగులు తీశారు. కానీ అక్కడ నీటి సరఫరా జరిగే పైపును హమీద్ కత్తిరించాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆస్తి తగాదాలతో కుమారుడి కుటుంబాన్ని హత్య చేసేందుకు హమీద్ తన ఇంటికి నిప్పంటించి, బయటి నుంచి తలుపులు వేసి తాళం వేశాడని స్థానికులు తెలిపారు. రెండో భార్యతో గొడవలు రావడంతో హమీద్ తన చిన్న కుమారుడు ఫైజల్ తో కలిసి కొంతకాలంగా ఇంట్లో నివసిస్తున్నాడు. మొదటి వివాహం నుండి అతని ఇద్దరు పిల్లలలో చిన్నవాడు. తండ్రి హమీద్ ఇచ్చిన వాటాలో ఫైజల్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ వివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక వ‌చ్చిన త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్లడిస్తామ‌ని తెలిపారు.

ఇవీ చదవండి.

Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Beauty Tips: వేసవిలో ముఖం మెరుపును కోల్పోయిందా?. అయితే ఈ ఆరెంజ్‌ ఫేషియల్‌ మీకోసమే..

RRR Movie Pre Release Event Live: ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సర్వం సిద్దం.. భారీగా చేరుకుంటోన్న ఫ్యాన్స్..