WhatsApp And Facebook Down: ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలు

WhatsApp And Facebook Down:: ప్రపంచవ్యాప్తంగా  ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలు నిలిచిపోయాయి.  రాత్రి 9 గంటల  నుంచి ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ పని చేయడం లేదు...

WhatsApp And Facebook Down: ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలు
Fb

Edited By: uppula Raju

Updated on: Oct 04, 2021 | 10:25 PM

WhatsApp And Facebook Down: ప్రపంచవ్యాప్తంగా  ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలు నిలిచిపోయాయి.  రాత్రి 9 గంటల  నుంచి ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ పని చేయడం లేదు. ఇది వరకు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడితే కేవలం 5 నుంచి 10 మాత్రమే ఇబ్బంది తలెత్తేది. కానీ ఇప్పుడు దాదాపు 20 నిమిషాలకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. అసలేం జరుగుతుందో తెలియకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇవాళ సాయంత్రం నుంచి వివిధ దేశాల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్ అయింది. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లోనూ ఇందుకు సంబంధించి మెసేజ్ ఒకటి కనిపించింది. అంతరాయం కలుగుతోందని.. తాము దానిపై పని చేస్తున్నామని ఫేస్‌బుక్ పేర్కొంది. త్వరలోనే దాన్ని పరిష్కరించి మీ ముందుకొస్తామని తెలిపింది. మరోవైపు ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అంతరాయం కలిగిందనే విషయాన్ని చాలామంది యూజర్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.

Read Also.. Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..