కోవిద్ మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా పరిహారం..కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

కోవిద్ మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కనీస చెల్లింపు తప్పనిసరి అని పేర్కొంది. వారికి ఎంత మొత్తం చెల్లించాలి...ఇందుకు నిబంధనలు ఏమిటన్నవి నేషనల్

కోవిద్ మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా పరిహారం..కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court

Edited By: Anil kumar poka

Updated on: Jun 30, 2021 | 12:15 PM

కోవిద్ మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కనీస చెల్లింపు తప్పనిసరి అని పేర్కొంది. వారికి ఎంత మొత్తం చెల్లించాలి…ఇందుకు నిబంధనలు ఏమిటన్నవి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పరిశీలించాల్సి ఉందని…వీటికి మీరే బాధ్యత వహించాలని స్పష్టం చేసిన కోర్టు..తన విధి నిర్వహణలో ఈ సంస్థ విఫలమైందని తప్పు పట్టింది. కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించాలని కోరుతూ లోగడ ఓ పిల్ కోర్టులో దాఖలు కాగా.. దీనిపై విచారణ సందర్భంలో… తాము ఇంత చెల్లించలేమని, తమ వద్ద నిధులు లేవని కేంద్రం చేతులెత్తేసింది. కానీ ఈ పిల్ పై మళ్ళీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, షా లతో కూడిన బెంచ్.. విచారణ జరుపుతూ కోవిద్ బాధితులకు ఎక్స్ గ్రేషియా సాయంతో బాటు ‘కనీస ప్రామాణిక ఊరట’ కల్పించడం మీ బాధ్యత అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీని ఆదేశించింది. ఇందుకు తగిన గైడ్ లైన్స్ రూపొందించాలని…ఎంత మొత్తం చెల్లించాలన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలని సూచించింది.

అలాగే కోవిద్ మృతుల డెత్ సర్టిఫికెట్ల విషయంలో కూడా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని .. వారి మరణ తేదీ..అసలు కారణం వంటివి కూడా ఈ గైడ్ లైన్స్ లో ఉండేలా చూడాలని కోర్టు కోరింది. ఇప్పటి నుంచి ఆరు వారాల్లోగా ఖచ్చితమైన రూల్స్ ని రూపొందించి సాధ్యమైనంత త్వరగా కోవిద్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఏమైనా ఈ పరిహారం విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది.

మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked

నెట్టింట్లో అరటిపండు తింటూ హల్ చల్ చేస్తున్న తొండ..వైరల్ అవుతున్న వీడియో : gecko eat banana viral video.

పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.

చిన్నారి నవ్వుకోసం కుక్క పిల్ల కుప్పి గంతులు..ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో :dog make fun viral video.