Covishield: కోవిషీల్డ్ తరఫున ఎలాంటి దరఖాస్తు రాలేదు.. వస్తే ఇస్తామంటున్న EU

|

Jun 29, 2021 | 4:46 PM

కోవిషీల్డ్ తరఫున మాకు ఎలాంటి దరఖాస్తు అందలేదని యురోపియన్ మెడికల్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తు నిబంధనల మేరకు వస్తే అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది.

Covishield: కోవిషీల్డ్ తరఫున ఎలాంటి దరఖాస్తు రాలేదు.. వస్తే ఇస్తామంటున్న EU
Covishield Excluded From New Eu Covid 'green Pass'
Follow us on

కోవిషీల్డ్ తరఫున మాకు ఎలాంటి దరఖాస్తు అందలేదని యురోపియన్ మెడికల్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తు నిబంధనల మేరకు వస్తే అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ‘కోవిషీల్డ్’ను ఈయూ మెడికల్ ఏజెన్సీ గుర్తించకపోవడంతో భారత విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోది సీరం ఇన్‌స్టిట్యూట్. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సృష్టించిన వ్యాక్సిన్ వ్యాక్స్‌ జర్విరియాతో పాటు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్లకు అనుమతి ఉంది. కోవిషీల్డ్ పేరు మీద ఎలాంటి దరఖాస్తు చేసుకోకపోవడంతో ఇప్పటి వరకు గుర్తించని యురోపియన్ మెడికల్ ఏజెన్సీ.

ఇదిలావుంటే..  భారత్‌లోకి మరో విదేశీ కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు సిప్లా ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతికి మార్కెటింగ్ కోసం సిప్లా దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే డీసీజీఐ అనుమతి లభించింది.

ఇవి కూడా చదవండి:  Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..