AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా డ్రోన్లతో పాకిస్తాన్ జమ్మూ ఎయిర్ బేస్ పై దాడి చేసిందా..? ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

తమ దేశంలో పిజ్జాలు, మందులు డెలివరీ చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి డ్రోన్లను భారీగా తెప్పించుకుందని, గత ఆదివారం జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడికి వీటిని వాడి ఉంటారని భారత సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి

చైనా డ్రోన్లతో పాకిస్తాన్  జమ్మూ ఎయిర్ బేస్ పై  దాడి చేసిందా..? ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
Pakistan Used China Drones
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 29, 2021 | 11:55 PM

Share

తమ దేశంలో పిజ్జాలు, మందులు డెలివరీ చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి డ్రోన్లను భారీగా తెప్పించుకుందని, గత ఆదివారం జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడికి వీటిని వాడి ఉంటారని భారత సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాక్ లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ ఎటాక్ కి పాల్పడినట్టు తెలుస్తోందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ చెప్పారు. 5 నిముషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లు జమ్మూ లోని ఇండియన్ ఎయిర్ బేస్ భవనాన్ని కుదిపివేసినట్టు ఆయన పేర్కొన్నారు. మొదటి పేలుడు కారణంగా ఈ భవనంలోని పై కప్పు భాగంలో రంధ్రం ఏర్పడిందని అన్నారు. రెండో పేలుడు వస్తువు బయట నేలపై పడిందని ఆయన చెప్పారు.ప్లేలుడు వస్తువులతో కూడిన పే లోడ్లను జారవిడవడానికి తక్కువ ఎత్తులో ఎగిరేలా ఈ డ్రోన్లను వినియోగించారు. ఈ నెల 27 న జరిగిన డ్రోన్ దాడి పై దర్యాప్తు జరిపే బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. తక్కువ ఖర్చుతో.. సులభంగా లభించే డ్రోన్స్ ని పని చేయకుండా నిర్వీర్యం చేసే టెక్నాలజీ ఇంకా దేశంలో అందుబాటులోకి రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే వీటిపై కాల్పులు జరిపి కూల్చివేయవచ్చునని ఈ వర్గాలు వివరించాయి.. ఈ కారణం వల్లే భారత జవాన్లు నిన్న కలుచౌక్ ప్రాంతంలో ఎగురుతున్న రెండు డ్రోన్లను 20 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేయడానికి యత్నించారు. అయితే వారి ప్రయత్నం విఫలమైంది. ఐరాసలో భారత అధికారి ఒకరు పాకిస్తాన్ డ్రోన్ల దాడి గురించి ప్రస్తావించి.. ఈ తరహా దాడులను నివారించేలా చూడాలని కోరారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Gangula Kamalakar : ఏడేళ్లు మంత్రి పదవులు వెలగబెట్టినా చేయనిది.. ఈటల ఇప్పుడెలా చేస్తారు : మంత్రి గంగుల

Woman Winking: అందరూ చూస్తుండగానే అతనివైపు కన్నుకొట్టింది.. ఆ తరువాతే అసలు కథ మొదలైంది..!