AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం తెలివిరా..! రూ. 20వేల కుక్కపిల్ల కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థుల మాస్టర్‌ ప్లాన్‌.. ! బెడిసికొట్టింది..

అయితే, వారు వచ్చిన బైక్ నంబర్ ప్లేట్ విజువల్స్‌లో స్పష్టంగా లేదు.దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఏం తెలివిరా..! రూ. 20వేల కుక్కపిల్ల కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థుల మాస్టర్‌ ప్లాన్‌.. ! బెడిసికొట్టింది..
Engineering Students
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2023 | 1:28 PM

Share

కేరళలో ఖరీదైన కుక్కపిల్ల చోరీ ఘటన సంచలనం రేపింది. కొచ్చిలోని నెట్టూర్‌లోని ఓ పెట్‌షాప్‌లో కుక్కపిల్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. దాంతో దుకాణం యజమాని చోరీకి గురైన పెంపుడు కుక్కను ఎలాగైనా తిరిగి పొందాలనుకున్నాడు. కుక్కపిల్ల చోరీకి గురైన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిందనుకున్న తన కుక్కపిల్లను కొన్ని రోజుల తరువాత ఎట్టకేలకు తిరిగి పొందాడు. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. కుక్కపిల్లను చోరి చేసింది ఇద్దరు యువ ఇంజనీరింగ్‌ విద్యార్థులుగా తేలింది. దాదాపు రూ.20,000 ఖరీదు చేసే స్పిట్జ్ జాతికి చెందిన కుక్కపిల్లను బైక్‌పై వచ్చిన ఒక యువతి, యువకుడు దొంగిలించినట్టుగా సీసీ ఫుటేజ్‌ఆధారంగా గుర్తించారు. తలకు హెల్మెట్‌ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి కుక్కపిల్లను హెల్మెట్‌లో దాచిపెట్టుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, అదే కుక్కపిల్ల కోసం మరో వినియోగదారుడు దుకాణానికి రావడంతో పెంపుడు జంతువు చోరీకి గురైందని షాపు యజమాని,సిబ్బంది గుర్తించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా యువకుడు కుక్కపిల్లను దొంగిలించినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులే వైట్టిలలోని మరో దుకాణంలో కుక్కల ఆహారాన్ని కూడా దొంగిలించారు. కుక్కపిల్లను దొంగిలించిన వ్యక్తి, మహిళ పక్క రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాసిత్ పనంగాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, వారు వచ్చిన బైక్ నంబర్ ప్లేట్ విజువల్స్‌లో స్పష్టంగా లేదు.దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

వారు మరొక దుకాణంలో దొంగిలించడానికి ప్రయత్నించారు. కానీ షాప్ యజమాని వారిని పట్టుకోవడంతో, వారు ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ని ఉపయోగించి డబ్బు చెల్లించారు. ప్రస్తుతం ఈ లావాదేవీకి సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తును కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్, శ్రేయ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పనంగాడ్ పోలీసులు వారిని కర్ణాటకలోని కర్కాలా నుంచి అరెస్టు చేశారు. నెట్టూరులోని పెట్ షాపులో చోరీకి గురైన రూ.20 వేల విలువైన 45 రోజుల వయసున్న కుక్కపిల్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన జనవరి 28న రాత్రి 7 గంటలకు జరిగింది. పిల్లిని కొంటారా అని ఇద్దరూ నెట్టూరులోని దుకాణానికి చేరుకున్నారు. దుకాణదారుడి దృష్టి మరల్చిన ఆ ఇద్దరూ ఆ కుక్కపిల్లను బోనులోంచి బయటకు తీసి హెల్మెట్‌లో దాచుకున్నారు. విద్యార్థులు మూడు స్పిట్జ్ కుక్కపిల్లల నుండి ఒకదాన్ని దొంగిలించారు. అలప్పుజాకు చెందిన ఓ వ్యక్తి డిమాండ్ మేరకు వాటిని దుకాణానికి తీసుకొచ్చారు. ఇద్దరు వెళ్లిన తర్వాత అలప్పుజాకు చెందిన వ్యక్తి కుక్కపిల్ల కోసం వచ్చినప్పుడు దొంగతనం జరిగిన విషయం దుకాణం యజమానికి తెలిసింది. కుక్కపిల్ల అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని తొలుత భావించాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలించారు. వీరు ప్రయాణిస్తున్న మార్గంలోని సీసీటీవీ విజువల్స్‌ను కూడా పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..