Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రామచంద్ర పిళ్లైని ప్రశ్నిస్తున్న ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దూకుడు ప్రదర్శిస్తోంది. కేసు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రామచంద్ర పిళ్లైని ప్రశ్నిస్తున్న ఈడీ
Delhi Liquor Scam

Updated on: Sep 18, 2022 | 10:22 PM

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దూకుడు ప్రదర్శిస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నిస్తోంది. రాబిన్‌ డిస్టలరీస్‌ పేరుతో రామచంద్ర పిళ్లై వ్యాపారం చేసినట్లు గుర్తించింది. అయితే ఢిల్లీ పెద్దల సమక్షంలో పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇండో స్పిరిట్స్‌తో పాటు కొంత మంది వ్యక్తుల నుంచి రామచంద్ర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రూ.2.30 కోట్ల వరకు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

ఈ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఏ-14గా రామచంద్ర పిళ్లైను చేర్చింది. ఈడీతో పాటు రామచంద్రను ప్రశ్నిస్తోంది ఐటీ అధికారులు. కాగా, ఈ లిక్కర్‌ స్కామ్‌లో శుక్రవారం 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌తో సంబంధం ఉందన్న అనుమానాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 18 కంపెనీలతో పాటు 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, బుచ్చిబాబు, పెరమన్‌ రిచర్డ్‌, చందన్‌రెడ్డి, విజయ్‌ నాయర్‌, దినేష్‌ ఆరోరా, శశికళ, రాఘవ, సమీర్‌ మహంద్రు తదితరులకు నోటీసులు ఇచ్చింది ఈడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి