Naveen Patnaik: బర్త్‌డే రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఒడిశా సీఎం.. 57 వేల మంది రెగ్యులరైజ్..

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

Naveen Patnaik: బర్త్‌డే రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఒడిశా సీఎం.. 57 వేల మంది రెగ్యులరైజ్..
Naveen Patnaik

Updated on: Oct 16, 2022 | 4:34 PM

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. తన పుట్టిన రోజు నాడు.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారంతో (అక్టోబర్ 16) నవీన్ 76వ వసంతంలోకి అడుగుపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు ఉండబోవంటూ స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ నియమాకాల ప్రక్రియ, పద్దతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం నవీన్ పట్నాయక్ వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు వీడియో సందేశంలో మాట్లాడారు. కాగా.. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.1300 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేబినెట్ లో కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని వివరించారు. ఒడిశాలో దానికి శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా రాష్ట్రంలోని 57వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

కాగా.. సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. తమకు దీపావళి ముందే వచ్చిదంటూ ఒకరినొకరు స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..