Utter Pradesh: పుట్టిన రోజు(Birthday) ఎవరికైనా వెరీ వెరీ స్పెషల్. అందులోనూ మొదటి పుట్టిన రోజు వేడుక అంటే ఇంకా స్పెషల్. పిల్లలకే కాదు.. తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు, పిల్లులకు కూడా పుట్టిన రోజు వేడుకలు.. అదీ చాలా ఘనంగా జరుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషం పదిమందితో పంచుకుంటున్నారు, అయితే ఇప్పుడు తాజాగా ఓ మొదటి రోజు పుట్టిన రోజు వేడుక నెటిజన్ల ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే గున్న ఏనుగు మొదటి పుట్టిన రోజు వేడుక. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు ఓ గున్న ఏనుగుకు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. లఖింపూర్ ఖేరీలోని దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఎలిఫెంట్ పార్టీని అటవీశాఖ అధికారులు ఓ బుజ్జి ఏనుగు పిల్లకు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఏర్పాటు అంతేకాదు.. పనిలో పనిగా ఆ ఏనుగు పిల్లకు పేరు కూడా పెట్టారు. ఆన్‌లైన్‌లో 200 మంది పంపిన పేర్ల జాబితా నుంచి ‘మష్కలీ’ పేరును ఎంపిక చేసి.. అటవీ అధికారులు బేబీ ఏనుగుకు పెట్టారు. ఏడాది వయసు ఉన్న ఏనుగుకు “మష్కలీ”గా నామకరణం చేశారు. ఈ చిట్టి ఏనుగు దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఏడాది క్రితం జన్మించింది. ఈ పార్టీలో చెరకు, బెల్లం, అరటిపండ్లను భారీగా చిట్టి ఏనుగుకి పెట్టి అధికారులు ఘనంగా పార్టీ ఇచ్చారు.
Also Read: